Anasuya : ఆగలేను అంటున్న అనసూయ.. పండుగాడ్ లో స్పెషల్ సాంగ్ రచ్చ..!

జబర్దస్త్ అనసూయ (Anasuya) వరుస సినిమాలతో బిజీగా ఉంది. సినిమాల్లో ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో నటిస్తూనే మరోపక్క స్పెషల్ సాంగ్స్ తో తన ఫ్యాన్స్ ని అలరిస్తుంది. లేటెస్ట్ గా వాంటెడ్ పండుగాడ్ సినిమాలో కూడా అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది. సుడిగాలి సుధీర్, సునీల్, సప్తగిరి నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ క్రేజీగా ఉండబోతుంది.

అనసూయలోని హాట్ యాంగిల్ ని వాడుకుంటూ ఈ సాంగ్ సిద్ధం చేశారు. రైటర్ శ్రీధర్ సీపాన డైరక్షన్ లో వస్తున్న పండుగాడ్ సినిమాలో Anasuya కేక కేక అనే స్పెషల్ ఐటం సాంగ్ చేసింది. ఈ సాంగ్ కోసం అనసూయ భారీ రెమ్యునరేషన్ తీసుకుందని చెప్పొచ్చు. పి.ఆర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు అనసూయ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.

పుష్ప సినిమాలో దాక్షాయనిగా అదరగొట్టిన అనసూయ పార్ట్ 2లో కూడా తన రోల్ తో మెప్పిస్తుందని అంటున్నారు. ఈమధ్యనే దర్జా అనే సినిమా కూడా చేసింది అనసూయ. సినిమాల్లో బిజీగా ఉండటం వల్లనే అనసూయ తనకు ఇంతమంచి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని కూడా వదిలేసింది.

 

Tags: Anasuya Special Song Wanted Pandugad Movie Sudigali Sudheer