‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా అల్లు శిరీష్ కోసం ఎంతకైనా తెగించాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ ఈ చిత్రం అంతటా మంచి మౌత్ టాక్‌కు తెచ్చుకుంది.యూత్‌ని ఎట్రాక్ట్ చేసే లిప్ లాక్‌లతో పాటు కామెడీ కూడా పనిచేసింది. లీడ్ పెయిర్ మధ్య సాగే కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది.
శిరీష్,అను ఒక బ్యూటీ ఫుల్ రొమాన్స్ ని పంచుకున్నారు.అది ఒక అందమైన పద్ధతిలో వచ్చింది. కొంతమంది నిజ జీవితంలో కూడా సన్నిహిత సంబంధాన్ని పంచుకోవడంతోనే అలాంటి కెమిస్ట్రీని తెరపై ప్రదర్శించడానికి కారణమని కూడా చెప్పారు. కానీ అను ఆ పుకార్లను ఖండించింది.ఏం చెప్పినా, చేసినా ఊర్వశివో రాక్షసివో శిరీష్, అను ఇద్దరికీ ఎప్పటి నుంచో వెతుకుతున్న మంచి కమ్‌బ్యాక్ హిట్‌ని అందించింది.