ఎన్టీఆర్ నో చెప్పిన కథతో బ్లాక్ బస్టర్ హీట్ కొట్టిన అల్లు అర్జున్.. ఇంతకీ ఆ సినిమా ఏమిటో తెలుసా..!

నందమూరి కుటుంబం నుంచి మూడో తరం హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ‌రుస‌ సినిమాలు చేసుకుంటూ అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన తాత నటరత్న ఎన్టీఆర్ కు తగ్గ మ‌నవడుగా తారక్ పేరు తెచ్చుకున్నాడు. ఇక ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు.Allu Arjun and NTR's lovely banter on Twitter is a delight to watch |  123telugu.com

ఇలా వదులుకున్న లిస్టులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ వదులుకున్న ఓ సూపర్ హిట్ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ అందుకున్నాడనే విషయం చాలామందికి తెలియదు. ఆ సినిమా మరేదో కాదు ఆర్య. క్రేజీ దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్- కాంబోలో వచ్చిన తొలి సినిమా కూడా ఇదే. ఈ సినిమాలో బన్నీకి జంటగా మెహతా హీరోయిన్‌గా నటిస్తే. శివ బాలాజీ ప్రధానోపాత్రలో నటించాడు. దిల్ రాజు ఈ సినిమాను ఎంతో గ్రాండ్గా నిర్మించాడు.

Arya (2004) - Photo Gallery - IMDb

2004లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఫీల్డ్ గుడ్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ రోజుల్లోనే రూ.30 కోట్ల రేంజ్ లో భారీ వసూలు సొంతం చేసుకుంది ఈ సినిమా. ఇక మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అల్లు అర్జున్ కంటే ముందే ఈ ఆర్య మూవీ స్టోరీని ఎన్టీఆర్ వద్దకు తీసుకు వెళ్లారట. అయితే అదే సమయంలో సింహాద్రి సినిమాతో బంపర్ హిట్ కొట్టి మాస్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్. ఈ సమయంలో ఇలాంటి లవ్ స్టోరీ వద్దని సున్నితంగా ఈ సినిమాను రిజెక్ట్ చేశారట. దాంతో ఆర్య స్టోరీ అల్లు అర్జున్ వద్దకు వెళ్ళగా ఆయన ఓకే చేసి సినిమాతో బంపర్ హిట్ అందుకున్నాడు.

Sukumar - Wikipedia