ఇండియా నెంబ‌ర్ 1 హీరోగా అల్లు అర్జున్‌… ఈ క్రేజ్ అరాచ‌కం రా సామి..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లోనే బన్నీ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు లేరనే చెప్పాలి. ఇప్పటికే సౌత్ ఇండియాలో తిరిగిలేని ఫాలోయింగ్ ఉన్న హీరోగా రికార్డుల్లోకి ఎక్కిన అల్లు అర్జున్ పుష్ప సినిమా సూపర్ హిట్ అవడంతో నార్త్ లో కూడా దూసుకుపోతున్నాడు. బన్నీ నటిస్తున్న పుష్ప 2 సీక్వెల్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ఇక బన్నీకి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇప్పటికే ఇన్‌స్టాలో బన్నీకి 21.8 మిలియన్ల ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఇటీవల ట్విట్టర్ కు పోటీగా కొత్తగా థ్రెడ్స్ యాప్ జుకర్ బర్గ్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాప్ లోను బన్నీ తిరుగులేని రికార్డ్ సృష్టించాడు. ఇండియాలోనే వన్ మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్న తొలి హీరోగా రికార్డుల్లోకి ఎక్కాడు. అసలు ఈ యాప్ గురించి ఇంకా చాలామందికి పరిచయం లేదు.

అలాంటి టైం లో బన్నీ తక్కువ టైం లోనే వన్ మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకోవడం అంటే బన్నీ క్రేజీ చూసి అందరూ షాక్ అవుతున్నారు. యాప్ ఏదైనా బన్నీ తర్వాతే ఎవరైనా అంటూ సోషల్ మీడియాలో బన్నీ అభిమానులు పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 సినిమాలో నటిస్తున్న బన్నీ ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే సినిమాలో కూడా నటించమన్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.