ఇండియాలోని ఖరీదైన కార్లన్నీ ప్రభాస్ ఇంట్లోనే… ఈ లిస్టు చూస్తే మైండ్ బ్లాకే బ్లాక్‌…!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టి.. ఇప్పుడు భారతీయ సినిమానే శాసించే హీరోగా ఎదిగాడు. బాహుబలి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు బ‌ద్దలు కొట్టిన ప్రభాస్.. రీసెంట్ గానే ఆదిపురుష్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్లాప్ టాప్ తెచ్చుకున్నా కూడా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి బాక్సాఫీస్‌కు తన స్టామినా ఏంటో మరోసారి చూపించాడు.

Prabhas becomes proud owner of a swanky car worth Rs 6 crore, fans go gaga

ఇక ప్రభాస్ ఆస్తులు విలువ విషయానికి వస్తే రూ.200 కోట్ల కంటే ఎక్కువ నికర విలువ కలిగిన ప్రభాస్ సీని కెరీర్ గురించి తెలిసినా ఆయన పర్సనల్ లైఫ్ లో ఎలాంటి కాస్ట్‌లీ కార్లు ఉపయోగిస్తారు అనేది చాలామందికి తెలియదు. ఈ పాన్ ఇండియా హీరో ఉపయోగించే కార్ల గురించి ఒకసారి చూద్దాం రండి.

లంబోర్ఘిని అవెంటడోర్ :
ఇండియాలోనే లంబోర్ఘిని కంపెనీకి చెందిన అవెంటడోర్ కార్‌ కలిగిన త‌క్కువ మంది హీరోల‌లో ప్రభాస్ కూడా ఒకరు. ఈ కారు ధర రూ. 6 కోట్లు. ఇది లంబోర్ఘిని కంపెనీకి చెందిన అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్‌. ఇది 6.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 740 హార్స్ పవర్, 690 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కార్ స్పెషాలిటీ ఏమిటంటే సింగిల్ క్లచ్ సెవెన్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ సిస్టం ఇవన్నీ ఉండటం వల్ల ఈ కారు వర్క్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది.

Prabhas Car Collection: What Cars Does Baahubali Star Have in His Garage?

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ :
ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఒకటి. ఈ కారు ప్రభాస్ గ్యారేజీలో కూడా ఉంది. అంతేకాకుండా 2016లో ప్రభాస్ ఫోర్త్ జనరేషన్‌కు చెందిన రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ అనే కార్‌ కొనుగోలు చేశాడు. ఈ SUV లో 4.4 లీటర్ డీజిల్ వి8 ఇంజిన్‌ కలిగి 340 పీఎస్ పవర్, 740 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ :
ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రపంచ మార్కెట్లోనే ఎంతో ఖరీదైన లగ్జరీకారీగా రికార్డుకు ఎక్కిన రోల్స్ రాయల్స్ ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన ‘ఫాంటమ్’ కారుని కొనుగోలు చేశాడు. ఈ కారు ధర సుమారు రూ. 8 కోట్ల కంటే ఎక్కువ.ఇక ప్రభాస్ గ్యారేజ్ లో ఉన్న అత్యంత కాస్ట్లీ కారులో ఇది కూడా ఒకటి. దీనిని 2013లో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఈ లగ్జరీ కారు 6.75 లీటర్లు కలిగిన v12 ఇంజన్ ఈ కారు సొంతం.. అంతే కాకుండా 460 పీఎస్ పవర్, 720 nm టార్క్ ఈ కారు నుంచి వస్తుంది. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది.

Fleet of swanky cars to a luxurious farmhouse, Prabhas owns these 5  expensive things | The Times of India

జాగ్వార్ ఎక్స్‌జే :
భారతీయ మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా వ్యవహరించే జాగ్వార్ ఎక్స్‌జే ప్రభాస్ కార్ల జాబితాలో ఒకటి. దీని ధర రూ. 1 కోటి కంటే ఎక్కువ ఉంటుంది. వెండి రంగులో కనిపించే ఈ కారుని ప్రభాస్ 2012లో కొనుగోలు చేశాడు. ఇది 3.0-లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వి6 డీజిల్ ఇంజిన్‌ కలిగి 275 పీఎస్ పవర్ 600 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ -స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

బీఎండబ్ల్యూ ఎక్స్3 :
జర్మన్ లోనే అత్యంత లగ్జరీ కార్లు తయారు చేసే సంస్థ బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన బ్లాక్ కలర్ ఎక్స్ 3 మోడల్ కార్ ప్రభాస్ 2018లో కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.ఈ కారుని ప్రభాస్ చాలా అరుదుగా వినియోగిస్తారని తెలుస్తోంది. నిజానికి బీఎండబ్ల్యూ ఎక్స్ 3 మూడు వేరియంట్లలో లభిస్తుంది. కావున ప్రభాస్ ఇందులో ఏ వేరియంట్ కొన్నారనేది స్పష్టంగా తెలియదు. ఇక డీజిల్ ఇంజన్ కలిగి ఉన్న ఈ కార్ 8 – స్పీడ్ ఆటోమేటిక్ గేర్ సిస్టం కలిగి ఉంది.