Aishwarya Rajesh : నేను కూడా బికిని వేస్తా.. నన్ను అలా వాడుకోండి అంటున్న హీరోయిన్..!

కోలీవుడ్ లో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్యా రాజేష్ (Aishwarya Rajesh) ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఆమెని కేవలం నటనా ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే చూస్తూ వచ్చాం. అయితే ఐశ్వర్యా రాజేష్ మాత్రం తాను కూడా గ్లామర్ షో చేస్తా.. అవసరమైతే బికిని కూడా వేస్తానని అంటుంది. తాను స్కిన్ షో చేస్తానని కానీ అది సినిమాకు అవసరం అనుకుంటే చేస్తానని అంటుంది ఐశ్వర్య రాజేష్.

అంతేకాదు లిప్ లాక్ సీన్స్, బెడ్ సీన్స్ కి కూడా తాను సిద్ధమని చెబుతుంది ఐశ్వర్య రాజేష్. తెలుగులో కూడా అమ్మడు ఒకటి రెండు ప్రయత్నాలు చేసిన ఐశ్వర్యా రాజేష్ (Aishwarya Rajesh) ఇక మీదట అన్నిటికి ఓకే అంటుంది. తనలో ఆ యాంగిల్ కూడా ఉందని దర్శకులు తనని అలా గుర్తించాలని చెబుతుంది అమ్మడు.

ప్రస్తుతం సూర్య అచలుడు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఐశ్వర్య రాజేష్ ఆ సినిమాలో ఆమె సెమీ న్యూడ్ గా కనిపిస్తుందని టాక్. మరి ఐశ్వర్య కూడా రెచ్చిపోవడం మొదలు పెడితే ఆడియెన్స్ కి పండుగే అని చెప్పొచ్చు. తన మీద ఉన్న ముద్రని చెరిపేయడానికి ఇక మీదట రెచ్చిపోయేందుకు రెడీ అంటుంది ఐశ్వర్య రాజేష్.

Tags: Achaludu, Aishwarya Bikini Show, Aishwarya Rajesh, Kollywood, Surya