Mrunal Thakur : సీతకి లక్కీ ఛాన్స్.. ఎన్.టి.ఆర్ తో జోడీ..!

ఇటీవల వచ్చిన సీతారామం సినిమాతో సత్తా చాటిన నటి మృణాల్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపుడి డైరక్షన్ లో తెరకెక్కిన సీతారామం సినిమాలో సీతగా (Mrunal Thakur ) మెప్పించింది మృణాల్. సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ గురించి అందరు చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో ఆమె నటన చూసి స్టార్ హీరోలు సైతం ఫిదా అయ్యారని తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఆమెకి వరుస లక్కీ ఛాన్సులు వస్తున్నట్టు టాక్.

లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ 30వ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur ) ని సంప్రదించినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ సీరియల్స్ తో మెప్పించిన మృణాల్ సీతారామం సినిమాలో అదరగొట్టింది. ఆ సినిమా చూసి ఆమెకు క్రేజీ ఛాన్సులు వస్తున్నాయట. ఎన్.టి.ఆర్ 30వ సినిమాలో మృణాల్ ని తీసుకోవాలని డైరక్టర్ కొరటాల శివ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అసలైతే జాన్వి కపూర్, అలియా భట్ లను హీరోయిన్స్ గా తీసుకోవాలని అనుకున్నారు. రీసెంట్ గా ఎన్.టి.ఆర్ కొరటాల మూవీలో కృతి శెట్టిని కూడా హీరోయిన్ గా అనుకున్నారని టాక్ వచ్చింది. అయితే ఫైనల్ గా ఈ సినిమాలో మృణాల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. సీతారామం తర్వాత మృణాల్ కి ఇది మరో గొప్ప అవకాశమని చెప్పొచ్చు.

Tags: koratala siva, Mrunal Thakur, NTR 30, Sitharamam, Tollywood