పెళ్లి కాకుండానే హీరోయిన్ సాయిప‌ల్ల‌వి ప్రెగ్నెంటా… వైర‌ల్ వీడియో ( వీడియో )

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెమ్యూనరేషన్ కోట్లలో ఇస్తాం అని ఆమెకు ఎన్నో ఆఫర్లు వచ్చినా సినిమాలో తన పాత్రకు మంచి గుర్తింపు ఉంటేనే ఆమె సినిమాకు ఓకే చెబుతోంది. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేయడంలో ఈ ముద్దుగుమ్మకు సాటి మరొక‌రు ఉండర‌నే చెప్పాలి.

ఈ క్రమంలోనే తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ ప్రేక్షకులలో మంచి పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఎవరైనా తనతో సినిమాలు చేసి నష్టపోతే రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాయి పల్లవిది అంత గొప్ప మనస్తత్వం. ఇదిలా ఉంటే సాయి పల్లవి ప్రెగ్నెంట్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం సాయి పల్లవి చీర కట్టుకుని వంట చేయటానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ చీరలో సాయి పల్లవి నిండుగా ఉండడంతో పాటు ప్రెగ్నెంట్ లా కనిపిస్తోంది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏంటి ? సాయి పల్లవి ప్రెగ్నెంట్ అంటూ కొందరు నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఇదేదో మూవీ షూటింగ్ అయి ఉంటుంది.. సాయి పల్లవి చాలా క్యూట్ లుక్ లో ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేయండి.