అంజ‌లికి కాబోయే భ‌ర్త‌కు ఈ క్వాలిటీస్ త‌ప్ప‌నిస‌రి… వామ్మో అన్నీ గొంతెమ్మ కోర్కెలేగా…!

హీరోయిన్ల నుంచి తమ సినిమాలతో పాటు వారి వ్యక్తిగత జీవిత విషయాలు ఎప్పుడు వారి అభిమానులకు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. హీరోయిన్ల పెళ్లి గురించి ఎప్పుడు నిత్యం ఎన్నో రకాల వార్తలు వస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఎందరో హీరోయిన్ల పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక తెలుగు అమ్మాయి స్టార్ హీరోయిన్ అంజలి పెళ్లి గురించి కూడా ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Actress Anjali To Get Married Soon Rumours Circles On Social Media

అచ్చ తెలుగు అమ్మాయి అయినా కోలీవుడ్లో సినిమాలు చేసి మంచి పేరు సొంతం చేసుకుంది. షాపింగ్ మాల్ అనే డబ్బింగ్ సినిమాతో తొలిసారిగా టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా తర్వాత జర్నీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా వ‌చ్చిన‌ క్రేజ్‌తో తెలుగులో పలు సినిమాల్లో నటించినా మహేష్- వెంకటేష్ కలిసి నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ త‌ర్వాత బాల‌య్య‌కు జోడీగా డిక్టేట‌ర్ సినిమా కూడా చేసింది. ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలలో అవకాశాలు రాక స్పెషల్ సాంగ్స్ లో నటిస్తోంది. ఇప్పుడు ఈ విషయం ఎలా ఉంచితే అంజలి పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు చకార్లు కొడుతున్నాయి. అంతేకాకుండా ఓ యంగ్ హీరోతో ప్రేమాయణం నడుపుతుందని గతంలో ఓ టాక్ కూడా నడిచింది. ఇదే సమయంలో తాజాగా అంజలి తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో ? అతనికి ఏయే క్వాలిటీస్ ఉండాలో చెప్పుకొచ్చింది.

Anjali Actress In Seethamma Vakitlo Sirimalle Chettu

రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అంజలి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు కూడా చేసింది. రిలేషన్‌షిప్‌లో ఒకరి పట్ల ఒకరికి మర్యాద చాలా ముఖ్యం అంటోంది ఈ బొద్దుగుమ్మ‌. అలాగే మర్యాద లేని వ్యక్తిని ఎప్పటికీ ఒప్పుకోను అంటోంది అంజలి. అలాంటి వ్యక్తితో సంబంధం పెట్టుకొనంటోంది.. కెరీర్, రిలేషన్‌షిప్‌ రెండు నాకు ముఖ్యం అంటుంది ఈ బ్యూటీ. ఇలా త‌న‌కు కోప‌రేట్ చేసేవాడే త‌న‌కు భ‌ర్త‌గా కావాలంటోంది. ఏదేమైనా అంజ‌లికి ఫుల్ ఫ్రీడ‌మ్ ఇచ్చేవాడే మొగుడిగా రావాలని ఆమె మాట‌లే చెప్పేస్తున్నాయి.