పెళ్లి చేసుకుంటే ఎప్పుడూ ఒకే మొగుడు… క‌ష్టం అంటోన్న హీరోయిన్‌..!

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది ఫరియా అబ్దుల్లా. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత పలు సినిమాల్లో నటించిన ఫరీయా నాగచైతన్య సరసన బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కి కూడా డ్యాన్స్ చేసింది. ఈ పాటతో కుర్రాళ్ల‌ను ఒక ఊపు ఊపిన ఫరియా నటనతో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సినిమాలోనే కాక సోషల్ మీడియాలను యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫొటోలు, పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది.

డాన్స్ చేస్తూ రీల్స్ అప్డేట్ చేయడం, హాట్ ఫోటోషూట్స్ తో కుర్రాళ్లను టెంప్ట్ చేయడంలో ముందుంటుంది ఫరియా. సినిమాలతో పాటు అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తు లైఫ్ లో బిజీగా గడుపుతోంది ఈ పొడుగు కాళ్ళ సుందరి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరీయా పెళ్లి గురించి చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకువ‌స్తూ అస‌లు పెళ్లి ఎందుకు ? చేసుకోవాలి ? పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఒకరితోనే ఉండాలి.. అలా ఉండడం కష్టమ‌ని చెప్పి షాక్ ఇచ్చింది. మామూలుగా లైఫ్ లాంగ్ ఒకరితోనే ఉంటే వారితో బాండింగ్ పెరుగుతుంది.. అది చాలా మంచి కాన్సెప్ట్. కానీ నేను అలా ఉండడం చాలా కష్టం అంటూ కామెంట్ చేసింది.

ఫరియా కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలామంది నెటిజ‌న్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఇలా ఆలోచించే వారిని పెళ్లి చేసుకోవడం వల్లే తొందరగా విడాకులు తీసుకుంటున్నారు. లైఫ్ లాంగ్ ఒకరితో ఉండడం కష్టం అంటున్నావా అంటూ ఆమెను ఆటాడుకుంటున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by PSD Works (@psd_works)