‘ ఆదిపురుష్‌ ‘ కు అక్క‌డ ఘోర అవ‌మానం… అప్పుడే సినిమా ప్లాప్ అంటూ….!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆదిపురుష్‌ సినిమా మానియా కనిపిస్తోంది. ప్రభాస్ – కృతిసన‌న్ జంట‌గా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. పలు భాషలలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్లు కూడా పూర్తి అయ్యాయి. ఆన్లైన్ బుకింగ్ పోర్టల్ వేదికగా చాలామంది ఈ సినిమా చూసేందుకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఇప్పటికే 3.5 లక్షల‌కు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం.

అయితే ఆదిపురుష్‌ తమిళ్ వెర్షన్ కోసం అమెరికాలో కేవలం 24 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయని సమాచారం. గురువారం సాయంత్రం వరకు ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే ఆదిపురుష్ త‌మిళ్ వెర్ష‌న్‌ చూసేందుకు అమెరికాలో కేవలం 24 మంది మాత్రమే టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇది ఘోర అవమానం లాంటిదే. ఈ సినిమా అమెరికాలో మొత్తం 255 ధియేటర్లలో తొలిరోజు రిలీజ్ అవుతుంది. తొలి రోజు మొత్తం 1009 షోలు ప్రదర్శించబడుతున్నట్టు మేకర్స్ చెబుతున్నారు.

ఇందులో తెలుగు వెర్షన్‌కు 552 షోలు, హిందీ వెర్షన్‌కు 436 షోలు ఉన్నాయి. ఈ రెండు వెర్షన్లకు సంబంధించి మొదటి రోజు టికెట్లు అన్నీ బుక్ అయ్యాయి. అయితే తమిళ వెర్షన్ 21 షోలుకు గాను ఇప్పటి వరకు కేవలం 24 టికెట్లు మాత్రమే అమ్ముడయ్యాయని సమాచారం. దీంతో ప్రభాస్ అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. అయితే తమిళ సినీ జనాలకు బాహుబలి తర్వాత సహజంగానే తెలుగు సినిమాలు అంటే మంట.

ఇప్పుడు తమిళ వెర్ష‌న్‌లో కేవలం 24 టిక్కెట్లు మాత్రమే అమ్ముడు కావడంతో ఆదిపురుష్ ప్లాప్‌ అంటూ తమిళం వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇక తమిళనాడులో కూడా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో స్క్రీన్లు కేటాయించలేదు. అందుబాటులో ఉన్న షోల‌కు కూడా రెస్పాన్స్ ఆశించిన స్థాయిలో రెస్సాన్స్‌ లేదు.

అక్కడ కూడా హిందీ, తెలుగు వెర్షన్లకు ఎటు చూసినా సోల్డ్ అవుట్ మెసేజ్లే కనిపిస్తున్నాయి. తమిళ వెర్షన్‌కు 20 శాతం టికెట్లు కూడా అమ్ముడుపోని పరిస్థితి. దీనిని బట్టి చూస్తుంటే తమిళ సినిమా జనాలు ఈ సినిమాపై అంతగా ఆసక్తి చూపటం లేదని అర్థమవుతుంది.