సైకిల్ ఎక్కేస్తా అంటోన్న వైసీపీ ఎమ్మెల్యే… వ‌ద్ద‌ని తేల్చిచెప్పిన చంద్ర‌బాబు..!

వైసీపీలో ఆయన ఒక టాప్‌ లీడర్.. మంత్రిగా కూడా పనిచేశారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చాక తొలి మూడేళ్ల పాటు మంత్రిగా ఉన్న ఆయన పూర్తి డమ్మీగా మాత్రమే ఉన్నారు. పేరుకు మాత్రమే మంత్రి పదవి చేతుల్లో ఉంది.. కానీ ఆయన అధికారం ఎప్పుడూ అనుభవించలేదు. చివరకు ఉద్యోగుల బదిలీలు, పోలీసు అధికారుల బదిలీలు అన్ని వైసిపి అధిష్టానంలో ఉండే ఓ కీలక నేత చెప్పు చేతల్లోనే జరిగేవి. మూడేళ్ల పాటు తీవ్ర అసహనంతో ఓర్చుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆ మంత్రి పదవి కూడా పీకేశారు.

n chandrababu naidu: Keep learning, you can do wonders: N Chandrababu to  IAS officers - The Economic Times

 

ఈ క్రమంలోనే వచ్చే ఏడాది ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకో ? వైసీపీలో ఉంటే ఆయనకు డౌట్ కొడుతోంది. దీంతో ఇప్పుడు తిరిగి సైకిల్ ఎక్కాలని చూస్తున్నారు. పలు పార్టీలు మారిన ఆ నేత గత టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కీలక స్థానం నుంచి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి మంత్రి హామీ రావటంతో వైసిపి కండువా కప్పుకుని ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

ఇప్పుడు అక్కడ ఘోరమైన అవమానాలకు తోడు.. రాజకీయ భవిష్యత్తు లేదన్న సందేహాలు కూడా ఆయనకు వచ్చేసాయి. ఈ క్రమంలోనే ఈసారి మళ్లీ ఎన్నికలకు ముందు మళ్ళీ సైకిల్ ఎక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే టిడిపి కీలక నేతలతో టచ్ లోకి వెళ్లిన ఆయన ఇప్పటికీ ఇప్పుడే పార్టీ మారిపోతాను.. మరి టిడిపిలో చేరితే ఎమ్మెల్యే టికెట్ తో పాటు, మంత్రి పదవి కూడా ఇస్తారా అని భేర‌సారాలు మొదలుపెట్టేసారట.

YSRCP gets Ceiling Fan as its common election symbol | YSR Congress Party

అయితే ఆయన బుద్ధి ఎలాంటిదో ? తెలిసిన చంద్రబాబు ఆయన ప్రతిపాదనలు లైట్ తీసుకోమని టిడిపి కీలక నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సదరు వైసిపి మాజీమంత్రి పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్కలా మారింది. వైసీపీలో ఉండేందుకు మనసు ఇష్టపడటం లేదు.. ఇటు టిడిపిలోకి వస్తే ఏదైనా హామీ వస్తుందా ? అని ఎదురుచూపులు చూస్తున్నారు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp