టాలీవుడ్ లో మూడు దశాబ్దాల క్రిందట మీనా ఓ సంచలనం. మీనా అంటే అప్పట్లో యువత ఫిదా అయిపోయేవారు. మీనా ఒక అందాల సౌందర్య రాసి. ముందుగా కోలీవుడ్‌లో బాలనటి గానే కెరీర్ ప్రారంభించిన మీనా తమిళ హీరో శివాజీ గణేషన్‌తో పలు సినిమాలలో నటించింది. శివాజీ గణేషన్ సినిమాలలో మీనా బాలనటిగా కనిపించింది. ఆ సమయంలో శివాజీ గణేషన్ ముద్దులొలికేలా ఉన్న మీనా ని ఎత్తుకుని భవిష్యత్తులో ఆమె కచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుందని చెప్పేవారట. ఆ తర్వాత ఆయన జోస్యం నిజమైంది. మీనా స్టార్ హీరోయిన్ అయ్యారు.
బాలనటిగా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించిన మీనా హీరోయిన్ అయ్యాక తమిళంలో తొలి సినిమాలో నటించారు. ఆ తర్వాత ఆమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో స్టార్ హీరోలుగా ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరు హీరోలతో నటించి సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. తెలుగులో వెంకటేష్ కి జోడిగా ఆమె నటించిన చంటి సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో మీనా అమాయక పాత్రలో ఉన్న వెంకటేష్ ను ప్రేమించడం.. వెంకటేష్ కోసం చివరకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాటం చేసిన పాత్రకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
ఆ సినిమా తర్వాత పదేళ్ళ పాటు తెలుగులో మీనాకు ఎదురులేకుండా పోయింది. విక్టరీ వెంకటేష్ – మీనా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ డూపర్ హిట్. చివరకు మీనాకు పెళ్లయ్యాక కూడా వెంకటేష్ కావాలని పట్టుబట్టి ఆమెను దృశ్యం సీరిస్ సినిమాలలో హీరోయిన్ గా తీసుకున్నారు. వెంకటేష్ కు మీనా అంటే ఎంత స్పెషలో దాన్ని బట్టి తెలుస్తోంది. మీనా ఎంత సైలెంట్ గా ఉన్నా ? ఆమె కెరీర్ లోను కొన్ని ఎఫైర్లు ఉన్నాయన్న పుకార్లు ఉన్నాయి. ఆమె ముందుగా తమిళంలో హీరో రాజ్ కిరణ్ తో ప్రేమాయణం నడిపిందని టాక్ వచ్చింది. ఆ తర్వాత మలయాళంలో నటించినప్పుడు అక్కడ హీరో జయరాంతోను ఆమెకు సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. ఇక కోలీవుడ్ సీనియర్ దర్శకుడు కేసర్ రవికుమార్ తో ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో పెద్ద సంచలన వార్త బయటకు వచ్చింది.
అప్పట్లో కె ఎస్.రవికుమార్ తన సినిమాలలో వరుసగా మీనా ను హీరోయిన్ గా తీసుకునేవారు. రజనీకాంత్ తో చేసిన ముత్తు సినిమాలో.. చివరికి తెలుగులో చిరంజీవితో కేఎస్. రవికుమార్ తెరకెక్కించిన స్నేహంకోసం సినిమాలోనూ మీనాయే హీరోయిన్. అప్పట్లో రవికుమార్ సినిమాలలో మీనా ఎక్కువగా కనిపిస్తూ ఉండడం తమిళ మీడియా వర్గాలను బాగా ఆకర్షించింది. ఇక కొన్ని తమిళపత్రికలు అయితే వీరిద్దరి మధ్య ఎఫైర్ల న్యూస్ అప్పట్లో బాగా ప్రచురించేవి. కేఎస్ రవికుమార్ కూడా మీనా మాయలో పడిపోయి తన భార్యను నిర్లక్ష్యం చేయడంతో.. ఆమె కోలీవుడ్ పెద్దలకు చెప్పిందని.. అప్పుడు కోలీవుడ్ పెద్దలు చేసిన పంచాయితీ దెబ్బతో మీనా కె ఎస్ రవికుమార్ కు దూరమైందన్న టాక్ ఉంది.