ఆనంకు చంద్ర‌బాబు ఇస్తోన్న బంప‌ర్ గిఫ్ట్ ఇదే… ఫుల్ ఖుషీ…!

నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిది రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలు అనుభవం. ఆనం కుటుంబం మొత్తం ఏకంగా ఎనిమిది దశాబ్దాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతోంది. నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ ఆనం కుటుంబానికి బలమైన అనుచర గ‌ణం ఉంది. తెలుగుదేశంతో కెరీర్‌ ప్రారంభించిన ఆనం ఆ తర్వాత కాంగ్రెస్లోకి వెళ్లి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు మంత్రి పదవులు కూడా చేపట్టారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆనం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఆత్మకూరు ఇంచార్జ్ అయ్యారు.

No gap between me and CM Jagan: MLA Anam Ramanarayana

టిడిపిలో ఎమ్మెల్సీ తో పాటు మంత్రి పదవి వస్తుందన్న ఆశలతో ఉన్న ఆయనకు.. ఆ పదవి రాకపోవడంతో గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి వెంకటగిరి ఎమ్మెల్యేగా పోటీచేసి ఘనవిజయం సాధించారు. వైసీపీలో గెలిచిన ఏడాది నుంచి ఉక్క‌పోత‌కు గురయ్యారు. సీనియర్ నేతగా ఉన్నా జ‌గ‌న్‌ మంత్రి పదవి ఇవ్వలేదు. అసలు కనీస గుర్తింపు లేదు. చివరకు నియోజకవర్గంలో చిన్న చిన్న పనులు కూడా కాని పరిస్థితి. అందుకే గత రెండు సంవత్సరాల నుంచి ఆనం అసమ్మ‌తి గళం వినిపిస్తూ వస్తున్నారు.

ఇక తాజాగా వైసీపీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు. ఇక వచ్చే ఎన్నికల నేపథ్యంలో ఆనం టిడిపిలో చేరటం లాంఛనం కానుంది. టిడిపిలో చేరుతున్న ఆనంకు చంద్రబాబు బంపర్ గిఫ్ట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆనం ఫ్యామిలీకి నెల్లూరు జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఆనం అయితే ఆత్మకూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు బలమైన అనుచర, అభిమాన గణం ఉంది.

kaivalya (@kaivalyaanam) / Twitter

అయితే ఆనం కుమార్తె కైవ‌ల్యా రెడ్డి కూడా పోటీ చేసేందుకు రెడీ అవుతుండడంతో ఆమెకు ఆత్మకూరు సీటు ఇచ్చి.. ఆనం నెల్లూరు సిటీ లేదా వెంకటగిరిలో ఎక్కడో ఒకచోట ?నుంచి పోటీ చేయవచ్చని తెలుస్తోంది. వైసీపీలో ఐదేళ్లుగా ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఉన్న ఆనం టిడిపిలోకి ఇంకా రాకుండానే రెండు అసెంబ్లీ సీట్లు హామీగా తీసుకున్నారు అంటే ఆయనకి ఇది బంపర్ గిఫ్ట్ అని చెప్పాలి.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, telugu news, trendy news, viral news, ysrcp