కృష్ణా జిల్లాలో తెలుగుదేశం ఖ‌చ్చితంగా ఓడిపోయే సీట్లు ఇవే.. బాబు రిపేర్ చేయ‌రా..?

ఏపీలో రాజధాని మార్పు ప్రభావం ఎక్కువగా ఉన్న కృష్ణ, గుంటూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సంచలన విజయాలు నమోదు చేస్తుందన్న అంచనాలు అయితే ఉన్నాయి. రాజధాని మార్పు ఈ రెండు జిల్లాల ప్రజలపై ఎక్కువగా ఉంది. దీంతో అధికార వైసిపిపై తీవ్రమైన వ్యతిరేకత ఇక్కడ కనిపిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలలో అంతర్గత చర్చల్లో కూడా వ్యతిరేకతను ఎలా ? అధిగమించాలి అన్న భయం అయితే పట్టుకుంది. ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకత.. రాజధానిని విశాఖకు మార్చి వేయడంతో అమరావతి మొత్తం కుదేలైంది.

kodali nani, నోటికొచ్చినట్లు ...

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో విజయవాడ, గుంటూరు నగరాలు ఎంతో అభివృద్ధి చెందాయి. ఇంకా చెప్పాలంటే ఈ రెండు జిల్లాలోను తిరుగులేని అభివృద్ధి జరిగింది. ఇప్పుడు ఆ అభివృద్ధి ఎక్కడా ? కానరావడం లేదు. ఇలాంటి సమయంలోనూ కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా ? అంటే చెప్పలేం సరి కదా ? ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ గత రెండు ఎన్నికల్లోను విజయం సాధించలేదు. ఆ రెండు ఏవో కాదు కొడాలి నాని ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ. ప‌క్క‌నే ఉన్న ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం పామర్రు.

YSRCP Pamarru | Facebook

విచిత్రం ఏంటంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న గుడివాడ నేడు కొడాలి నాని కి అడ్డాగా మారిపోయింది. అసలు కొడాలి నాని పై గెలవడం సంగతి అలా ఉంచితే బలమైన ప్రత్యర్థిని కూడా నిలబెట్టలేని దుస్థితికి తెలుగుదేశం దిగజారిపోయింది. ఇక పక్కనే ఉన్న పామర్రు లో 2009, 2014, 2019 ఈ 3 ఎన్నికల్లోను తెలుగుదేశం చిత్తుచిత్తుగా ఓడిపోతూ వస్తోంది. ప్రస్తుతం సీనియర్ నేత వర్ల రామయ్య కుమారుడు వర్ల‌ కుమార్ రాజాకు నియోజకవర్గ ఇన్చార్జి పగ్గాలు ఇచ్చారు.

గన్నవరం జంట హత్యల కేసులో పామర్రు టీడీపీ ఇన్‍ఛార్జ్ వర్ల కుమార్ రాజా సంచలన  వ్యాఖ్యలు | Sensational comments of Palmeru TDP in-charge Varla Kumar Raja  in Gannavaram twin murder case ...

వర్ల‌ కుమార్ రాజా కష్టపడుతున్న కేవలం పార్టీలో కొందరి నేతలను మాత్రమే కలుపుకుని వెళుతున్నారని.. అందరి మధ్య సమన్వయం చేయలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా అటు గుడివాడలోను ఇటు పామర్రులోను బలమైన అభ్యర్థులను రంగంలోకి దించకపోతే తెలుగుదేశం మళ్లీ ఓడిపోయే ఛాన్సలే.. ఉన్నాయని జిల్లాలో పార్టీ కీలక నేతల అంతర్గత సమావేశంలోని చర్చికి వస్తుంది. మరి చంద్రబాబు గుడివాడ పామర్రు పై ప్రత్యేకంగా కాన్సన్ట్రేషన్ చేస్తారో లేదో చూడాలి.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, tdp, tdp chandrababu, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp