BiggBoss 6 : వాడివేడిగా నామినేషన్స్.. ఈసారి ఎంతమంది ఉన్నారంటే..!

బిగ్ బాస్ సీజన్ 6 (BiggBoss 6) లో సెకండ్ వీక్ నామినేషన్స్ పూర్తయ్యాయి. లాస్ట్ వీక్ అదే మొదటివారం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నా కూడా బుధవారం నుంచి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవడంతో ఆదివారం నో ఎలిమినేషన్ అని ట్విస్ట్ ఇచ్చాడు నాగార్జున. ఇక సెకండ్ వీక్ మాత్రం సోమవారం నాడే నామినేషన్స్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ వారం ఎనిమిది మంది హౌజ్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.

ఇంతకీ ఈ వారం BiggBoss 6 నామినేషన్స్ లో ఉన్న వారు ఎవరంటే రేవంత్, గీతు. ఫైమా, అభినయ శ్రీ, ఆది రెడ్డి, రోహిత్ & మరినా, రాజశేఖర్, షాని ఇలా ఎనిమిది మంది ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. ఈసారి మాత్రం ఎలిమినేషన్ పక్కా అని చెప్పొచ్చు. అంతేకాదు ఫస్ట్ వీక్ ఎలాగు ఎలిమినేషన్ లేదు కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసినా చేయొచ్చని చెప్పొచ్చు.

ఇక ఈ సీజన్ నాగ్ హోస్టింగ్ కి మంచి మార్కులు పడుతున్నాయి. ఇదివరకు సీజన్లు కూడా బాగానే చేసినా అప్పుడప్పుడు కేవలం బిగ్ బాస్ టీం ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదువుతున్నాడు అని అనిపించేది. కానీ ఈసారి నాగ్ కూడా షో చూస్తున్నాడని అనిపిస్తుంది. ఫైనల్ గా బిగ్ బాస్ 6 ఇప్పుడిప్పుడే ఆడియెన్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది.

Tags: BiggBoss, BiggBoss 6, BiggBoss News, BiggBoss Nominations, Tollywood