RRR రేంజ్ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్న సీతారామం డైరక్టర్..!

సీతారామం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరక్టర్ హను రాఘవపుడి తన నెక్స్ట్ సినిమాని అంతకన్నా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సీతారామం హిట్ తో మైత్రి మూవీ మేకర్స్ తో డీల్ సెట్ చేసుకున్న డైరక్టర్ హను ఈసారి RRR కాన్సెప్ట్ లో ఓ అద్భుతమైన పీరియాడికల్ కథ అనుకుంటున్నట్టు తెలుస్తుంది.RRR లో కొమరం భీం బ్యాక్ డ్రాప్ లో ముస్లీం గెటప్ లో ఎన్.టి.ఆర్ కనిపిస్తాడు. ఆ పాత్ర నిడివి తక్కువే అయినా అది ఆడియన్స్ ని అలరిస్తుంది.

ఇక ఇప్పుడు అదే క్రమంలో హిందు, ముస్లీం కథతో హను ఓ ప్రయోగం చేయనున్నాడట. ఇందులో ఇద్దరు స్టార్స్ నటిస్తారని తెలుస్తుంది. హనుతో ఆల్రెడీ సినిమాలు చేసిన నాని, శర్వానంద్ ఈ మల్టీ స్టారర్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. హను రాఘవపుడి చేయబోయే ఈ మల్టీ స్టారర్ సినిమా గురించి మిగతా డీటైల్స్ త్వరలో వస్తాయి.

హను తో నాని కృష్ణగాడి వీర ప్రేమగాథ.. శర్వానంద్ పడి పడి లేచేమనసు సినిమాలు చేశారు. అయితే సీతారామం బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ ఇద్దరు హీరోలు ఈ మల్టీస్టారర్ సినిమాకు ఓకే చెప్పడం పక్కా అని చెప్పొచ్చు.

Tags: Hanu Raghavapudi, Nani, RRR, Seetharamam, Sharwanand, Tollywood