BiggBoss 6 : ఫస్ట్ కెప్టెన్ ఆదిత్య.. వరస్ట్ గీతు..!

బిగ్ బాస్ సీజన్ 6 మొదటి వారం కెప్టెన్ గా బాలాదిత్య గెలిచారు. ఈ వారం రోజుల్లో బాలాదిత్య తన పర్ఫార్మెన్స్ తో మెప్పించారు. ఇక కెప్టెన్సీ టాస్క్ లో ఆయన విజేతగా నిలిచారు. వారం రోజుల బిగ్ బాస్ హౌజ్ లో మిస్టర్ కూల్ గా మంచి మార్కులు కొట్టేశాడు బాలాదిత్య. బిగ్ బాస్ సీజన్ 6 (
BiggBoss 6) మొదటి కెప్టెన్ గా బాలాదిత్య నిలిచాడు. ఇక ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ గా గీతు రాయల్ నిలిచింది.

హౌజ్ లో అందరి కన్నా దూకుడుగా ఉంటున్న గీతు ఆమె తన మాటలతో హౌజ్ లో ఉన్న వారిని టార్గెట్ చేస్తుంది. తన మాట తీరు అంతే అని తెలుస్తున్నా హౌజ్ లో ఉన్నప్పుడు కొద్దిగా సైలెంట్ గా ఉండాలి. ఇక ఎక్కువమంది ఈ వారం వరస్ట్ పర్ఫార్మర్ అని గీతుకే ముద్ర వేయగా ఆమెని బిగ్ బాస్ జైలుకి పంపించమని చెప్పారు. కెప్టెన్ బాలాదిత్య గీతుని జైలులో వేసి తాళం వేశారు.

బిగ్ బాస్ సీజన్ 6 (BiggBoss 6) మొదటి వారం అందరిని ఆకట్టుకుందని చెప్పొచ్చు. 21 మంది హౌజ్ మెట్స్ లో ఇంకా కొందరు ఓపెన్ అవలేదు. అసలు కొందరైతే హౌజ్ లో ఉన్నారా లేరా అన్నటుగా కూడా ఉన్నారు. మొత్తానికి సీజన్ 6 మొదటి వారం సక్సెస్ ఫుల్ గానే ముగిసిందని చెప్పొచ్చు.

Tags: Baladitya, BiggBoss, BiggBoss 6, Geetu Royal, Star Maa, Tollywood