Pawan Kalyan : హరి హర వీరమల్లు పవర్ టీజర్.. తొడగొట్టాడోయ్ తెలుగోడు.. అదిరిపోయిందబ్బా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) హీరోగా క్రిష్ డైరక్షన్ లో వస్తున్న సినిమా హరి హర వీరమల్లు. ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా పవర్ గ్లాన్స్ అంటూ ఓ టీజర్ వచ్చింది. హరి హర వీరమల్లు సినిమాలో పవన్ డిఫరెంట్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ పవర్ గ్లాన్స్ లో మన పవర్ స్టార్ స్టామినా చూపిస్తూ తొడగొట్టాడోయ్ తెలుగోడు అంటూ ఓ అద్భ్హుతమైన బ్యాక్ గ్రౌండ్ సాంగ్ తో టీజర్ వచ్చింది.

ఈ పవర్ గ్లాన్స్ చూసిన పవర్ స్టార్ Pawan Kalyan ఫ్యాన్స్ కి రోమాలు నిక్కబొడుచుకోవడం పక్కా.. ఓ పక్క జల్సా రీ రిలీజ్ హంగామాలో అదరగొడుతున్న ఫ్యాన్స్ కి ఈ పవర్ గ్లాన్స్ మరింత ఫీస్ట్ ఇచ్చింది. క్రిష్ తన మార్క్ చూపించడంతో పాటుగా పవర్ స్టార్ ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకుంటున్నారని ఈ టీజర్ తో తెలుస్తుంది.

ఈ సినిమాను మెగా సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం రత్నం నిర్మిస్తున్నారు. సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో జాక్వెలిన్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. 2023 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

 

Tags: Hari Hara Veeramallu, krish, Nidhi Agarwal, Pawan kalyan, Power Glance, Powerstar Pawan Kalyan