బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాలీవుడ్ లో ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లాడిన తర్వాత Priyanka Chopra ఇండియాకి రావడం కూడా ఆపేసింది. ఇక బాలీవుడ్ సినిమాల పై కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదని తెలుస్తుంది. హాలీవుడ్ లో సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ లు చేస్తూ వస్తున్న ప్రియాంకా చోప్రా తన హాట్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. లేటెస్ట్ గా ప్రియాంకా చోప్రా తన సెల్ఫీతో సర్ ప్రైజ్ చేసింది.
అమ్మడు తీసుకున్న టాప్ యాంగిల్ సెల్ఫీలో తన యద అందాలు ఆకర్షణగా ఉన్నాయి. బ్లాక్ టాప్ లో అదే బ్లాక్ గాగుల్స్ తో Priyanka Chopra అదరగొట్టేస్తుంది. ఇక్కడ సినిమాలు చేయకపోయినా సరే పీసీకి ఇక్కడ కూడా ఇప్పటికీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను షేర్ చేస్తున్న ఫోటోస్ ని ఎక్కువా ఇండియా నుంచే కామెంట్స్, లైకులు పడుతున్నాయని టాక్.
బాలీవుడ్ ని పూర్తిగా మర్చిపోయిన ప్రియాంకా చోప్రా ఇక మీదట చేస్తే హాలీవుడ్ సినిమాలే తప్ప మిగతా సినిమాలకు ఛాన్స్ లేదని అంటుంది. ఒకవేళ పీసీ ఇండియన్ సినిమాలు చేయదలచుకుంటే మాత్రం తెలుగు సినిమాల్లో కూడా ఆఫర్ అడిగే ఛాన్స్ ఉంది.