లైగర్ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా ఫెయిల్యూర్ నిద్ర పట్టకుండా చేస్తుంటే సినిమాకి IMDb ఇచ్చిన రేటింగ్ మరింత డీలా పడేలా చేస్తుంది. ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ అంటూ వరల్డ్ మొత్తం ఏ సినిమా రిలీజైనా సరే IMDb ఒక రేటింగ్ ఇస్తుంది. కొన్ని సినిమాలు కమర్షియల్ గా సూపర్ హిట్ అయినా IMDb తక్కువ రేటింగ్ ఇస్తుంది. అయితే కొన్ని సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా IMDb రేటింగ్ అదిరిపోతుంది.
లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు IMDb షాకింగ్ రేటింగ్ ఇచ్చింది. సినిమాకు కేవలం 1.7 రేటింగ్ ఇచ్చి మైండ్ బ్లాక్ చేసింది. IMDb ఇచ్చిన రేటింగ్ కి కొందరు పర్ఫెక్ట్ అంటుంటే కొందరు మాత్రం మరీ 10 కి 1.5 చాలా ఘోరమని అంటున్నారు. లైగర్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని అనుకున్న విజయ్ ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయ్యింది.
లైగర్ సినిమాకు IMDb రేటింగ్ చూసి రౌడీ ఫ్యాన్స్ మరింత ఫీల్ అవుతున్నారు. లైగర్ పోతే పోయింది నెక్స్ట్ సినిమా ఖుషితో అయినా విజయ్ హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు.