Hebah Patel : కుమారి అందాలకు కుర్రాళ్లు విలవిల..!

అంతకుముందు అలా ఎలా సినిమా చేసినా సరే హెబ్బా పటేల్ (Hebah Patel) అనగానే అందరికి కుమార్ 21ఎఫ్ సినిమానే గుర్తుకొస్తుంది. ఆ సినిమాతో అమ్మడు ఓ రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లు ఆ హాట్ ఇమేజ్ తో వరుస సినిమాలు చేసింది. ఇప్పటికీ హెబ్బా పటేల్ అంటే యూత్ ఆడియెన్స్ కి మంచి క్రేజ్. అయితే అమ్మడు సినిమాల సెలక్షన్ సరిగా లేకపోవడంతో ఆమె కెరియర్ లో వెనకపడ్డది. అయినా సరే అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తుంది.

ప్రస్తుతం ఓదెల రైల్వే స్టేషన్ సినిమా చేస్తున్న హెబ్బా పటేల్ దానితో పాటుగా గీత, గెలిసినవాళ్లు సినిమాల్లో కూడా నటిస్తుంది. తమిళంలో ఆద్య అనే సినిమా కూడా చేస్తుంది హెబ్బా పటేల్. ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే హీరోయిన్స్ సోషల్ మీడియాలో తమ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ని అలరిస్తారు.

లేటెస్ట్ గా హెబ్బా (Hebah Patel) కూడా తన శారీ ఫోటో షూట్ తో ఇన్ స్టాగ్రాం లో ఫోటో పెట్టింది. కట్టింది శారీనే అయినా కూడా కుర్రాళ్లు విల విలలాడుతున్నారు. హెబ్బా అంటేనే హాట్నెస్ కి కేరాఫ్ అడ్రెస్ అనేలా ఆడియెన్స్ ఫిక్స్ అయ్యారు. మరి రానున్న సినిమాలతో అయినా ఆమె ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి.

Tags: Hebah, Hebah Patel, Kumari 21F, Kumari Hebah, Tollywood