పూర్ణతో ఆ బంధంపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ రవిబాబు… ఆమె అంటే ఎందుకంత ఇష్ట‌మో చెప్పేశాడుగా..!

టాలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ రవిబాబు. దివంగత సీనియర్ నటుడు చలపతిరావు కుమారుడు అయిన రవిబాబు అల్లరి నరేష్ హీరోగా వచ్చిన అల్లరి సినిమాతో మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు రవిబాబు. స్వతహాగా నటుడు.. కామెడీ పాత్రలతో పాటు విలన్ పాత్రలు పోషించి మెప్పించారు.

అలాగే దర్శకుడిగా కూడా తన ప్రతిభ చాటుకున్నారు. ఇప్పటివరకు 75కు పైగా సినిమాలలో నటించిన రవిబాబు ఎక్కువగా విలన్ పాత్రలలో నటిస్తూ అభిమానులను మెప్పించాడు. అవును, అవును 2 లాంటి హర్రర్ సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాడు. అయితే రవిబాబు చాలా సినిమాలలో హీరోయిన్ పూర్ణ పేరు తప్పకుండా వినిపిస్తూ ఉంటుంది. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వ‌చ్చాయి.

రీసెంట్గా ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన సినిమాలోనూ పూర్ణ హీరోయిన్గా నటించింది. దీంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందన్న పుకార్లు బాగా వైరల్ అయ్యాయి. రవిబాబు తన తాజా ఇంటర్వ్యూలో పూర్ణ గురించి ఆసక్తికరమైన ప్రశంసలు చేశాడు. పూర్ణతో నాకు లవ్ ఎఫైర్ ఉందని. పుకారులు ఉన్నాయని.. ప్రతి డైరెక్టర్ కి తన నటులతో అలాంటి అనుబంధమే ఉంటుందని చెప్పాడు.

నాకు కూడా పూర్ణతో అలాంటి అనుబంధమే ఉంది.. ప్రతి డైరెక్టర్ చెప్పిన దానితో పోలిస్తే నటీనటులు 10 నుంచి 20 శాతం ఎక్కువగా నటిస్తూ ఉంటారని… అయితే పూర్ణమాత్రం డైరెక్టర్ చెప్పిన దానికంటే 200% ఎక్కువగా నటిస్తుందని తెలిపాడు. తాను చేసే సిమాలలో హీరోయిన్ అనగానే కచ్చితంగా పూర్ణపేరే గుర్తుకు వస్తుందని.. పూర్ణ అయితేనే త‌న సినిమాల్లో హీరోయిన్ పాత్రకు తన వంతు న్యాయం చేస్తుందని. తన భావిస్తానన్నాడు.

ఆ కార‌ణంతోనే తన సినిమాలలో ఎక్కువగా పూర్ణను పెట్టుకుంటానని రవిబాబు చెప్పాడు. ఆ పాత్రకు కూడా ఆమె న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉంటేనే ఓకే చెప్తుందని.. లేకపోతే అస్సలు ఒప్పుకోదని రవిబాబు చెప్పుకొచ్చాడు.