‘ భోళాశంకర్ ‘ సినిమా మెగాస్టార్‌కు మరో ఆచార్య కానుందా.. ఇది ప‌క్కానా…!

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో రీయంట్రీ ఇచ్చాక ఎక్కువగా రీమేక్‌ సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి. నటించిన ఖైదీ నెంబర్ 150, గాడ్ ఫాదర్ తాజాగా నటిస్తున్న భోళాశంకర్ సినిమాలు రీమేక్‌లే కావడం విశేషం. అలాగే త్వరలో కురసాల కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కి సినిమా కూడా మలయాళ హిట్ సినిమా బ్రో డాడీకి రీమేక్‌గా వస్తోంది.

చిరంజీవి రీయంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 సినిమాతో పాటు ఈ సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. ఇక చిరు డైరెక్ట్ గా కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమా అయితే పెద్ద డిజాస్టర్ అయింది. ఇంకా చెప్పాలంటే చిరంజీవికి ఈ సినిమా ఒక పీడకలగా మిగిలిపోయింది. చిరు ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా తమిళంలో ఎప్పుడో అయిదారేళ్ల క్రితం అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. తాజాగా రిలీజ్ అయిన భోళాశంకర్ టీజర్ చూసిన మెగా వీరాభిమానులకు నీరసాలు లోడ్ అయ్యాయి. మెహర్ రమేష్ కూడా కథ, కథనాలు డైలాగులతో టీజర్ తోనే మెగా అభిమానులకు నీరసం తెప్పించాడు. టీజర్ లో చిరంజీవి స్టైల్ తో పాటు డైలాగులు ఏమాత్రం ఆసక్తిగా లేవు.

చిరు చెప్పిన తెలంగాణ యాస కూడా ఎవరికి నచ్చటం లేదు. ఈ సినిమాపై ఉన్న ఒకే ఒక్క ఆశ ఏంటంటే మెహర్ రమేష్ డైరెక్ట్ గా చేసిన సినిమాలు అన్ని డిజాస్టర్లు అయ్యాయి. అయితే రీమేక్‌ సినిమాల‌తో మాత్రం మనోడు మంచి హిట్లు కొట్టాడు. ఆ ఒక్క సెంటిమెంట్ ఆశ మిగిలి ఉందే తప్ప… ఏమాత్రం తేడా కొట్టిన చిరంజీవికి భోళాశంకర్ మరో ఆచార్యగా మిగిలిపోక తప్పదని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటున్నారు. మరి దీనిని మెహర్ రమేష్ ఎంతవరకు బ్రేక్ చేస్తాడో చూడాలి.