అక్క‌డ ‘ ఆదిపురుష్ ‘ టిక్కెట్ రేటు రు. 2 వేలు… అయినా దొర‌క‌ట్లేదుగా…!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ బాహుబలి సినిమాల తర్వాత ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు ప్రభాస్ ను ఒక్కసారిగా ఇండియన్ సినిమా శాఖ‌రాగ్రాన‌ కూర్చోబెట్టాయి. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ యూనివర్సిల్‌ స్టార్ట్ అయిపోయాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ సాహో సినిమాలో నటించాడు. ఈ సినిమా తెలుగులో అంచనాలు అందుకో లేకపోయినా బాలీవుడ్లో ఏకంగా రు. 150 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఇది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పాలి.

ప్రభాస్‌ను నార్త్ జనాలు ఎంత అభిమానిస్తున్నారో సాహో సినిమాకు వచ్చిన వసూళ్లే చెబుతున్నాయి. అయితే రాధేశ్యామ్ సినిమా భారీ అంచనాలతో వచ్చిన అన్ని భాషల్లోనూ డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమా వచ్చిన రెండేళ్లకు ప్రభాస్ ఆదిపురుష్‌ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమాకు తొలి రోజు టికెట్లు దొరకని పరిస్థితి.

నార్త్ నుంచి సౌత్ వరకు సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ మాల్స్ ఇలా ఎక్కడ చూసినా ఆదిపురుష్‌ హంగామా కనిపిస్తోంది. తొలి మూడు రోజులకు ఇప్పటికే అన్ని థియేటర్లలో టికెట్లు ఫుల్ అయినా పరిస్థితి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఆదిపురుష్‌ టిక్కెట్ రేటు ఏకంగా రు. 2000 పైనే పలుకుతుంది. అయినా కూడా టికెట్లు దొరకని పరిస్థితి. ఢిల్లీలోని పివిఆర్ డైరెక్టర్ కట్ అంబియన్స్ మాల్ లో ఆదిపురుష్‌ టిక్కెట్ రేటు చూసిన జనాలు అవాక్కవుతున్నారు. అక్కడ ఒక్కో టిక్కెట్ ధర రు. 2000 గా నిర్ణయించారు.

అక్కడ థియేటర్లో ఈరోజు రాత్రి 9 గంటల షోకి ఆదిపురుష్‌ హిందీ వెర్షన్ 2డీ షో చూడాలంటే 2000 చెల్లించాల్సి ఉంది. అదే 7 గంటల షోకి త్రీడీ వెర్ష‌న్‌ సినిమా చూడాలంటే టికెట్ రేటు రు. 2050గా ఉంది. అంతేకాకుండా బాలీవుడ్లో మొదటి రోజు టిక్కెట్లు అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి. దీనిని బట్టి ప్రభాస్ క్రేజ్, ఆదిపురుష్‌ మానియా ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

విచిత్రం ఏంటంటే తెలుగుకు పోటీగా అటు నార్త్ లోను, ఆదిపురుష్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఈ సినిమాకు ఉందన్న ప్రచారంతో బిజెపి పాలిత రాష్ట్రాలు, హిందుత్వవాదులు నుంచి ఈ సినిమాకు తిరుగులేని మద్దతు లభిస్తోంది.