వెంకిమామ ఓవ‌ర్సీస్ బిజినెస్ ఎంతో తెలుసా..!

విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగచైతన్య కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం వెంకీమామ.  ఈసినిమా డిసెంబర్ 13న  ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కాబోతుంది. ఈరోజే విడుద‌ల చేసేందుకు ప్ర‌త్యేక కార‌ణం లేక‌పోలేదు. ఆ రోజు విక్ట‌రీ వెంకటేష్ పుట్టినరోజు కూడా కావడంతో అభిమానులకి మరింత పండగనే చెప్పాలి. కె.ఎస్.రవీంద్ర(బాబీ) డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిం కార్పొరేషన్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలకి అద్భుతమైన స్పందన లభిస్తుంది. ఇక ఈ ఏడాది ఎఫ్2 తో వెంకటేష్, మజిలీ తో నాగచైతన్య బ్లాక్ బస్టర్లు కొట్టి మంచి ఊపుమీదున్నారు. దీంతో ఈ చిత్రంపై  భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగినట్టే బిజినెస్ కూడా జరుగుతుందని తెలుస్తుంది. ఇక తాజాగా ఈ చిత్రం ఓవర్సీస్ బిజినెస్ కూడా పూర్తయినట్టు సమాచారం. యూ.ఎస్.ఏ లో ఈ చిత్రాన్ని 2.4 కోట్లకు అమ్మినట్టు తెలుస్తుంది. ఇక రెస్ట్ ఆఫ్ వరల్డ్ కి 0.40 కోట్ల కు అమ్మకాలు జరిగినట్టు తెలుస్తుంది. టోటల్ గా ఓవర్సీస్ మొత్తం 2.8 కోట్లకు అమ్మారన్న మాట.

వెంకిమామ ఓవ‌ర్సీస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 0.7 మిలియన్ నుండీ 0.8 మిలియన్ డాలర్ల వరకూ రాబట్టాల్సి ఉంది. వెంకీ ఎఫ్2 2 మిలియన్ డాలర్ల పైనే వసూల్ చేయగా.. అక్కినేని నాగ‌ చైతన్య న‌టించిన‌ మజిలీ చిత్రం 0.9 మిలియన్ డాలర్ల పైనే వసూల్ చేసింది. కాబట్టి వెంకీమామ చిత్రం 0.8 మిలియన్ డాలర్లను  రాబ‌డితే ఆ సినిమా భారీ హిట్ కొట్టిన‌ట్లే ఓవ‌ర్సీస్ బిజినేస్‌తో వెంకిమామ దూకుడుమీదున్న‌ట్లే లెక్క‌. ఈ సినిమాతో అటు వెంక‌టేశ్‌, ఇటు నాగ‌చైత‌న్య ఇద్ద‌రు ఓవ‌ర్సీస్‌లో త‌మ‌కున్న మార్కెట్‌ను బాగానే ఉప‌యోగించుకోనున్నారు.

Tags: NagaChaitanya, Overseas Business, SureshProductions, Tollywood, Venkatesh, VenkyMama