మేధావి ముదిరితే పిచ్చోడవుతాడు (RGV )

అవును మేధావి ముదిరితే పిచ్చోడవుతాడు అనటానికి పెద్ద ఉదాహరణ గా రాంగోపాల్ వర్మ సరిగ్గా సరిపోతాడు. RGV అన్నిటిలోను మేధావి కాకపోవచ్చు కానీ సినిమాలు తీయటం లో మాత్రం ఒకప్పుడు మేధావే. శివ, గాయం లాంటి సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని, తెలుగు హీరోయిజం రెండిటిని మార్చేశాడు. తెలుగు సినిమా గురించి చెప్పుకోవాల్సి వస్తే ‘శివ సినిమా ముందు శివ సినిమా తరువాత’ అని చెప్పుకుంటారు సినీ పండితులు. శివనే కాదు ఆ తరువాత తీసిన గాయం, క్షణ క్షణం లాంటి సినిమాలతో సినివిమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. అంతటి గొప్ప దర్శకుడు ఆ తరువాత కాలం లో కనుమరుగయిపోయాడు.

ఎంతోమంది దర్శకులకు ఆరాధ్యుడయిన ఈయన తన ఐడెంటి కాపాడుకోవటానికి ఏమిచేయాలో తెలియక పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తూ, సోషల్ మీడియాలో జీవనం సాగిస్తున్నాడు.
ఇప్పుడు ఆయన మేధావితనం ఎంతగా పెరిగి పోయిందంటే సెక్స్ సినిమాలు తీసుకునే స్థాయికి. అదికూడా మించిపోయి కనీస ఖర్చులకోసం సంపాదించుకోవటానికి రక్త చరిత్రలు కలిగిన వాళ్ళ కథలను వీరోచిత కథలుగా చూపించుకుంటూ ఇప్పుడు దానినికూడా దాటేసి జనాల ఎమోషన్స్ ను వాడుకుంటూ జనాలను కులాలుగా, మతాలుగా విడగొట్టి కనీసం ఒక కులం వాళ్ళో, ఒక వర్గం వాళ్ళో చూస్తే చాలులే ఖర్చులు వెళ్లిపోతాయి అనే స్థాయికి దిగజారిపోయాడు.

ఎవరైనా తన పిచ్చితనమ్ గురించి అడిగితే నేను సమాజాన్ని బాగుకోసం చేయను, నాపని సినిమాలు తీయటం మాత్రమే అనే సమాధానం చెపుతుంటాడు. నిజానికి సమాజంలో బ్రతికే ఏ మనిషయినా తాను చేసే ప్రతిపనిలో సామజిక బాధ్యత కలిగి ఉండాలి. మనం చేసే పని వల్ల సమాజానికి మేలు కలగక పోయినా కనీసం కీడు జరగకూడదు అనే ఆలోచ ఉండాలి. అయితే RGV లాంటి వాళ్లకు మనం సామజిక దృక్పధం నేర్పించేలేము కానీ అలంటి వాళ్ళు తీసే సినిమాలు నుంచి మన పిల్లలను కుటుంబాలను దూరంగా ఉంచుకుంటే కనీసం మనవంతుగా సమాజాన్ని కాపాడుకోవచ్చు.

Tags: director, KammaRajyamlo KadapaRedlu, RamGopal Varma, Tollywood