మండలిలో రాజధాని బిల్లు గట్టేక్కేనా..?

ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. చర్చకు దారితీస్తున్నాయి. మూడురాజధాను ఏర్పాటు, అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి మెజార్టీ ఉన్న వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో అలవోకగా ఆమోదించుకోగలిగింది. అయితే ఆ బిల్లులు శాసనమండలిలో ఆమోదం పొందాల్సి ఉంది. నేడు పెద్దల సభకు అవి రానున్నాయి. అక్కడ అవి గట్టేక్కుతాయా? వీగిపోతాయా? అనే ఉత్కంఠత సర్వత్రా నెలకొంది. కారణం ఏపీ శాసనమండలిలో అధికార వైసీపీ అంతగా బలం లేకపోవడమే కారణం. మండలంలో మొత్తం సభ్యుల సంఖ్య 58. అందులో విపక్ష టీడీపీకి చెందిన సభ్యులు 28 మంది ఉన్నారు. అధికార వైసీపీకి 9, బీజేపీకి 2, పీడీఎఫ్‌కు 6, స్వతంత్రులు 3, నామినేటేడ్‌ ఎమ్మెల్సీలు 6 మంది ఉన్నారు. కాంగ్రెస్‌ 1, కాగా 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తగినంత సంఖ్యా బలం లేని మండలిలో వైసీపీ ప్రభుత్వం తమ బిల్లులను ఎలా పాస్‌ చేసుకుంటుందా? అని అందరిలో చర్చ మొదలైంది.

ఇదిలా ఉండగా బిల్లుల ఆమోదం కోసం అధికార పార్టీ ఇప్పటికే పక్కా ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆ బిల్లులపై ఓటింగ్‌ పద్ధతిలో కాకుండా మోజువాణి పద్ధతిలో ఆమోదింపజేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడు దీనిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

Tags: AP LEGESLTIVE COUNCIL MEMBERS, CAPITAL BILL, cm jagan