ఎమ్మెల్యే రాపాకకు జనసేన అధినేత పవన్‌ ఘాటు లేఖ

జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పరిస్థితి ఏమిటో ఏమీ అర్థం గాకుండా ఉంది. ఆయనను ప్రజలే విశ్వసం లేదనుకుంటుంటే ఇప్పుడు పార్టీ నేతలు సైతం అలానే వ్యవహరిస్తుండడం గమనార్హం. అధినేత పవన్‌ నిర్ణయాలకూ వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు. ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. మూడు రాజధానుల ఏర్పాటును ఆయనన తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే, ఆ బిల్లుకు మద్దతు తెలుపుతానంటూ ఆ పార్టీ చెందిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావు ప్రకటించి సంచలనం రేపారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతించడం విశేషం. ఇప్పుడిదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యే రాపాక ప్రకటనపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కూడా అదే స్థాయిలో స్పందించారు. ఘాటు లేఖను రాశారు. ” గౌరవనీయులపై వరప్రసాద్‌రావు గారికి అంటూనే హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టన్ను ఏపీ డిసెంట్రలైజేషన్‌ అండ్‌ ఈక్వల్‌ డెవలప్‌మెంట్‌ రిజయన్‌, అమరావతి మెట్రో డెవలప్‌మెంట్‌ యాక్ట్‌ తదితర బిల్లులన్నింటినీ వ్యతిరేకించాలని ఆదేశించారు. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాలని, అందుకు వ్యతిరేకంగా ఓటింగ్‌లో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని పవన్‌ స్పష్టం చేశారు. మరి లేఖతో ఎమ్మెల్యే రాపాక తన నిర్ణయాన్ని మార్చుకుంటారో? లేక జనసేన నిర్ణయాలను ధిక్కారిస్తారా? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags: jasena cheaf pawan kalyan, mla rapaka varaprasadrao