అయోధ్య తీర్పు గురించి వై ఎస్ జగన్ మెసేజ్

భారత దేశం మొత్తం ఎన్నో సంవత్సరాలనుండి ఎదురు చూస్తున్న అయోధ్య వివాదం పై ఈరోజు సుప్రీం తీర్పు వెల్లడించే నేపధ్యం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ సోషల్ మీడియా ధ్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మెసేజ్ చేసారు.

“అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది. ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను. ప్రజలందరుకూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను.”

తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ అంగీకరించిన మీదటే ధర్మాసనం తీర్పు వెలువరించి నేపధ్యం లో భారత దేశ పౌరులుగా దానిని గౌరవించి అగీకరించవలసిన బాధ్యత భారతీయులందరిపైన ఉంటుంది.ప్రజలందరుకూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను.

Tags: AyodhyaVerdict, INDIA, Message, SupremeCourt, YS Jagan