గోవా భామా తాప్సీ పన్నూ కొత్త పంథా ఎంచుకుని వరుస విజయాలతో దూసుకుపోతున్నది. నటనకు ఆస్కరామున్న ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ మందుకు సాగుతున్నది. అభిమానుల మన్ననలను పొందుతున్నది. విమర్శలకు ప్రశంసలను పొందుతున్నది. గతేడాది పింక్ సినిమాతో ఘన విజయాన్ని అందుకుంది. తాజాగా ప్రఖ్యాత భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న శెబాష్ మిథు చిత్రంలో లీడ్ రోల్‌ను పోషిస్తున్నది. ఇక ఈ చిత్రాన్ని వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తుండగా, రాహుల్ ధోలాకియా షాబాష్ మిథు దర్శకత్వం వహిస్తున్నారు . ఇది ఫిబ్రవరి 5, 2021 న ప్రేక్షకుల ముందుకు రానున్నది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నటి తాప్సి పన్ను తన ట్విటర్లో షేర్ చేసింది. అభిమానులతో ఆ ఆనందం పంచుకుంది. అందులో తాప్సీ ట్రేడ్మార్క్ సన్ క్యాప్ పెట్టుకుని, కవర్ డ్రైవ్ షాట్‌ను బాదుతున్న ఫోజుతో అందరినీ ఆకట్టుకుంటున్నది. సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతున్నాయి. ఆ పోస్టర్‌తో పాటు తాప్సి తన కామెంట్‌ను కూడా ట్యాగ్ చేసింది. మీ అభిమాన మగ క్రికెటర్ ఎవరని నన్ను ఎప్పటి నుంచో అడిగారు, కాని వారి అభిమాన మహిళా క్రికెటర్ ఎవరని మీరు వారిని అడగాలి’ అని కామెంట్‌ను జోడించి ఆ పోస్టర్‌ను షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందరనీ ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అంతర్జాతీయ స్థాయిలో అనేక మ్యాచ్‌లను ఆడారు. టెస్టు, వన్డే తదితర ఫార్మట్లలలో కలిపి సుమారు 6000కు పైగా పరుగులను సాధించారు. ఈ ఘనతను సాధించిన ఏకైక మహిళగా రికార్డును నమోదు చేశారు. అదీగాక భారత మహిళా క్రికెట్ జట్టుకు 2005 మరియు 2017లో రెండు ప్రపంచ కప్ ఫైనల్స్‌లో నాయకత్వం వహించడం గర్వకారణం.