శాసనమండలి రద్దుపై విపక్ష టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు అధికార పార్టీ వైసీపీపై దుమ్మెత్తి పోస్తున్నారు. తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని మరోసారి ముఖ్యమంత్రి జగన్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలను గుప్పించారు. వ్యంగ్యాస్ర్తాలను సంధించారు. ఈ మేరకు తన ట్వటర్ ఖాతాలో ఓ పోస్టును పెట్టారు. ఆయన అందులో ఏమి పోస్టు చేశారంటే..
జగనన్న నీకు ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను కట్టబెట్టారు. అయినా 28 మంది ఎమ్మెల్సీలకు భయపడుతున్నారు. నీవు ఇంత పిరికివాడికి అనుకోలే. ప్రజలు నీవు పోరాడతావని అనుకున్నారు. కానీ ఇలా పిరికివాడిలా పారిపోతావని కాదు అంటూ చురకలంటించారు. పనిలో పనిగా ఆ పోస్టుకు ఎమోజీలను జోడించి ముఖ్యమంత్రి జగన్‌కు ట్యాగ్ చేశారు ఎంపీనీ నాని. అవి సోషల్ మీడియాలో వైరల్ మారాయి. మరోవైపు ఆ పోస్టును టీడీపీ శ్రేణులు తెగ షేర్ చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ట్రోల్ చేస్తున్నారు.