చంద్ర‌బాబు అరెస్టు ఎందుకు త‌ప్పో చెప్పిన హీరో విశాల్‌…!

టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసిన తీరు చూసి మన దేశంలో చట్టాలు న్యాయాలు ఉన్నాయా ? చంద్రబాబు పరిస్థితి అలా ఉంటే ఇక సామాన్యుడు సంగతి ఏమిటన్న భయం ప్రతి ఒక్కరిలోనూ కలిగింది. ఇంకా చెప్పాలంటే వైసిపి వాళ్లలో కూడా భయం కలుగుతుంది.. చంద్రబాబును అరెస్టు చేసిన తీరును చాలామంది ఇప్పటికే ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అభిమానిని అనే బయటికి చెప్పుకునే తమిళ హీరో విశాల్ రెడ్డికి కూడా అదే అనిపించింది.

విశాల్ రెడ్డి పేరుకు తమిళ హీరో అయినా ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లా అన్న సంగతి తెలిసిందే. హైదరాబాదులో తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన విశాల్ చంద్రబాబు అరెస్టుపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరడంతో మాట్లాడారు. ఆయ‌న‌ అరెస్టుకు ముందు కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేది.. అలాంటి వ్యక్తిని అరెస్టు చేస్తే మాలాంటి సామాన్యులకు ఒక భయం కలుగుతుంది.. అయితే పక్కా ఆధారాలతో చంద్రబాబును అరెస్టు చేసి ఉంటే బాగుండేది అంటూ విశాల్ కామెంట్ చేశాడు.

ప్రస్తుతం విశాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాలలో హాట్‌ టాపిక్ గా మారాయి. కాగా విశాల్ బాల్యం అంతా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనే సాగింది. 2 ఏళ్ల‌ క్రితం విశాల్ కుప్పం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని.. అక్కడ వైసిపి నుంచి బరిలోకి దిగి చంద్రబాబుపై పోటీ చేయనున్నాడని ప్రచారం జరిగింది. అయితే విశాల్‌ తండ్రి దీనిని ఖండించారు. తన కుమారుడు రాజకీయాల్లోకి రావట్లేదని చెప్పారు.

ఏది ఏమైనా 14 ఏళ్ళు సీఎం గా పనిచేసిన చంద్రబాబుపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, భారతీయుల నుంచి సానుభూతి వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలోనే చాలామంది తెలుగు హీరోలు కూడా చంద్రబాబు అరెస్టుపై మాట్లాడటానికి భయపడుతున్న సమయంలో విశాల్‌ చాలా ధైర్యంగా చంద్రబాబు అరెస్టు తప్పని చెప్పటానికి వెనుకాడ లేదు.