ఎన్టీఆర్ హీరోగా యాక్షన్ సినిమాల దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ఆది.. 2002 మార్చ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ నిర్వహించారు. ఆ రోజుల్లో ఎటువంటి అంచనలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఆరోజుల్లోనే 108 కేంద్రాల్లో 50 రోజులకు పైగా ఆడింది. అలాగే 98 కేంద్రాల్లో 100 రోజులు పైగా ఆడి ఆ రోజులోనే ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది.
అదే విధంగా ప్రస్తుతం 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని మరోసారి రీరిలీజ్ చేయాలని ఎన్టీఆర్ అభిమానులు కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారా. ఎన్టీఆర్ ఆది సినిమాతోనే దిల్‌రాజు డిస్ట్రిబ్యూటర్ గాటాలీవుడ్‌లో అడుగుపెట్టి ప్రస్తుతం టాలీవుడ్ ను శాసించే అగ్ర నిర్మాతగా మారారు. ఇక అదే విధంగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా హీరోయిన్గా నటించిన కీర్తి చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఈ సినిమాలోనందిని అనే పాత్రలో ఎంతో హుందాగా చక్కగా నటించింది. ఎన్టీఆర్ సినిమా తర్వాత ఈమే ‘కాశి’ ‘శ్రావణ మాసం’ ‘ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు’ ‘సాధ్యం’ ‘బ్రోకర్’ వంటి సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు సరిగ్గా ఆడకపోవటంతో ఈమె కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగలేదు అనే చెప్పాలి. కీర్తి చావ్లా టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్, కన్నడ సినిమాల్లో కూడా ఈమె నటించింది.
ఆ పరిశ్రమలు కూడా కలిసి రాలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లో ఆమెను చూసి ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఆమె లుక్స్ ఎవరు ఊహించిన విధంగా మారిపోయింది అంటూన్నారు.
View this post on Instagram