మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అలా వైకుంఠపురములో సినిమాపై ఇప్పుడు హాట్‌హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఈసినిమాపై ఇప్పటికే అనేక వార్తలు ట్రోల్ అవుతున్నా లెక్కచేయకుండా చిత్ర యూనిట్ సినిమాను పూర్తి చేసింది. అయితే ఈ సినిమా ప్రారంభం నుంచే అనేక రూమర్లు టాలీవుడ్లో, సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఈ ట్రోల్ అవుతున్న విషయాల్లో, సోషల్ మీడియాలో వినిపిస్తున్న చర్చల్లో అసలు విషయాలు ఏమిటీ అని ఆరా తీస్తే…
బన్నీ హీరోగా తెరకెక్కుతున్న అలా వైకుంఠపురములో సినిమాకు సంబంధించి ముందు నుంచి ఈ సినిమా సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఇంటిగుట్టు సినిమాను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్కిస్తున్నారు అనే టాక్ వినిపించింది. ఇంటిగుట్టు సినిమాను ఈనాటి కాలంకు తగిన విధంగా మాడ్రన్‌గా తయారు చేస్తున్నారనే టాక్‌ను చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పట్టించుకోలేదు. సినిమాను తనదైన శైలీలో తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరోమారు మరో టాక్ వినిపిస్తుంది.
ఇంటిగుట్టు సినిమా గురించి మరిచిపోయిన చిత్ర యూనిట్‌కు ఇప్పుడు షాకింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేమంటే మళయాళంలో హిట్ కొట్టిన చిత్రం మై బాస్ అనే సినిమాకు ఈ సినిమా రీమేక్ అనే టాక్ వస్తుంది. మళయాళంలో దిలీప్, మమతా మోహన్‌దాస్ జంటగా నటించగా, సినిమాకు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. ఇందులో హీరో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా, సాఫ్ట్వేర్ కు బాస్‌గా మమతామోహన్‌దాస్ నటించారు. ఈ సినిమాలో కూడా అల్లు అర్జున్ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా నటిస్తున్నారు. మరి ఈ సినిమా లో పూజాహెగ్డే బన్నీకి బాస్‌గా నటిస్తుందా.. అనేది సినిమా విడుదల అయితే కానీ తెలియదు. సో మైగాడ్‌కు ఈ సినిమా రీమేకా.. లేక ఇంటిగుట్టుకు కొనసాగింపా అనేది త్వరలో తేలిపోనున్నది.