ర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సినిమా ఇప్పటికే 40శాతం షూటింగ్ జరుపుకుని ఇప్పుడు మరో 60శాతం షూటింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ అన్ని సన్నద్ధం చేసింది. అయితే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ అప్డేట్స్ ప్రకారం చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివారులోని రామోజీ ఫిలింసిటిలో జరుగుతుంది. ఫిలింసిటిలో దాదాపుగా రెండు మూడు రోజులు జరుకున్న తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన సెట్స్‌లోకి షిప్ట్ అవుతుంది.
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. రామోజీ ఫిలింసిటిలో జరుపుకుంటున్న ఈ షూటింగ్ అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉన్న రామ్ చరణ్‌తో పాటు వందలాది మంది జానియర్ ఆర్టిస్టులు ఈ షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం జరుతున్న షూటింగ్ కోర్టుకి సంబంధించిన సన్నివేశం. అల్లూరి సీతారామరాజుని బ్రిటీషు న్యాయస్థానం ప్రశ్నించే సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో కేవలం రామ్ చరణ్‌కు సంబంధించిన పార్ట్‌ను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనడం లేదు. హైదరాబాద్ శివారులో వేసిన సెట్స్‌లో ఎన్టీఆర్, చరణ్‌లపై కొన్ని కీలకమైన సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. ఈ సెట్స్‌లోనే దాదాపు సినిమా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఏమైనా మిగిలిపోయిన షూటింగ్‌ను సినిమా ప్రచారం ప్రారంభించాక పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని ఫిలింనగర్ వర్గాల కథనం. సినిమా అనుకున్న టైంకే వస్తుందనే భరోసాలో చిత్ర యూనిట్ ఉండగా, అభిమానుల్లో మాత్రం అనేక సందేహాలు ఉన్నాయి.