ఆంధ్రాకు పెట్టుబ‌డులు క‌ల్ల‌… యువ‌త భ‌విష్య‌త్తు గుల్ల‌..!

ఆంధ్రప్రదేశ్ నాయకత్వం రాజకీయాల గురించి ఇప్పుడు కార్పొరేట్ సర్కిల్స్‌లో జరుగుతున్న ప్రచారం చాలా ఘోరంగా ఉంది. తాళిబన్ల‌ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ లో అయినా పెట్టుబడులు పెట్టవచ్చు కానీ ఏపీ జోలికి మాత్రం వెళ్ళకూడదు అంటున్నారు. అప్థాన్ల‌ను పాలించే విష‌యంలో తాలిబన్లు తాము అనుకున్న చట్టాన్ని కఠినంగా అమలు చేసుకుంటారు. కానీ ఏపీలో ఇప్పుడు ఎలాంటి ? చట్టాలు అమలు అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదన్న ప్రచారం జరుగుతుంది ఇక్కడ..!

సమన్ బోస్‌కు మల్టీ నేషనల్ కంపెనీకి ఎండిగా చేశారు. ఆయన హయాంలో ఏపీకి సిమెన్స్‌ ద్వారా వచ్చిన ప్రాజెక్టుతో రెండున్నర లక్షల మంది ట్రైన్ అయ్యారు. ఇందులో నిజంగా స్కామ్ ఉంటే ఆధారాలు చూపించి అరెస్టు చేయాలి కానీ.. రాజకీయ కక్ష సాధింపుల కోసం అక్ర‌మ అరెస్టులు చేయ‌డం ఎవ్వ‌రికి న‌చ్చ‌డం లేదు. ఏది ఏమైనా ఇలాంటి పాలనలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ? ముందుకు రావడం లేదు.

కియా లాంటి ఎఫ్‌డీఐ సాధించిన రాష్ట్రం ఇప్పుడు ఎందుకు కోరగాకుండా పోయింది. నిజానికి సుమన్ బోసుకు ఏపీ సిఐడి వేధింపులు మొదటిసారి బయటపడ్డాయి. కానీ లూలూను వెళ్ళగొట్టిన వ్యవహారంలోనే కార్పొరేట్ సర్కిల్స్‌లో ఏపీపై ఘోర‌మైన‌ ప్రచారం జరిగింది. ఏపీలో అసలు పెట్టుబడులు పెట్టబోమని లూలూ ప్రకటించడం సంచలనం అయింది. వెంకయ్య నాయుడు, చంద్రబాబు ఎంతో కష్టపడి లూలూను విశాఖకు తీసుకువచ్చారు. ఇప్పుడు దాన్ని తరిమేసిన పద్ధతులు చూసి ఏపీ అంటేనే కార్పొరేట్ కంపెనీలు భయపడే పరిస్థితి వచ్చేసింది.

ఒకవేళ ఏపీలో ఆదాని – గ్రీన్ కో పెట్టుబడులు పెడుతున్న ఇవి ఎక్కువగా భూములు తీసుకునే కంపెనీలే గాని ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు కాదు. ఓవైపు పెట్టుబడులు రావడం లేదు. యువతకు ఉపాధి లేకుండా పోతుంది. అటు ప్రభుత్వ రంగంలో అయినా యువతకు అవకాశాలు ఉన్నాయా ? అంటే వాలంటీర్ పోస్టులు తప్ప ఏమీ లేవు. ఏది ఏమైనా ఈ దెబ్బతో రాష్ట్రంలో ఓ తరం ఉపాధి కోసం వలస పోవాల్సిన ఘోరమైన పరిస్థితి వచ్చేసింది. చేసుకున్నవాడికి చేసుకున్నంత అని నిట్టూర్పు తప్ప ఏమీ చేయలేము.