కృష్ణంరాజు కూతుళ్ల బాధ్యత ఎవరిదీ? ప్రభాస్ ఆ బాధ్యత మోస్తాడా?

ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే.. ఆయన మరణంతో సినీ ఇండస్ట్రీతో పాటు ప్రభాస్ ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. మధుమేహం, పోస్ట్ కొవిడ్ లక్షణాలు, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ తో కృష్ణంరాజు మరణించారని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

కృష్ణంరాజు మరణంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెబల్ స్టార్ కన్నుమూయంతో ఇప్పుడు ఆయన కూతుర్ల విషయంలో చర్చ జరుగుతోంది.. కూతుర్ల విషయంలో ఆయన పూర్తి చేయాల్సిన బాధ్యతలు మిగిలే ఉన్నాయి.. అయితే ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారా అనే దానిపై చర్చించుకుంటున్నారు.

కృష్ణంరాజు 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్లూరులో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు.. కృష్ణంరాజుకు మొదటి సీతాదేవితో వివాహమైంది. తర్వాత 1996 సెప్టెంబర్ 20న శ్యామలా దేవిని వివాహం చేసుకున్నారు. వీరికి ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వీరి విషయంలో కృష్ణంరాజు పూర్తి చేయాల్సిన బాధ్యతలు ఇంకా ఉన్నాయి. వీరు ముగ్గురికి ఇంకా పెళ్లి కాలేదు. కృష్ణంరాజుకు కొడుకులు లేరు..

కృష్ణంరాజు సోదరుడి కుమారుడే ప్రభాస్.. ప్రభాస్ నే కన్న కొడుకులా భావించారు. అందుకే కొన్ని రోజులుగా ప్రభాస్ పెళ్లితో పాటు కూతుర్ల పెళ్లి విషయంలో కృష్ణంరాజు ఆలోచించారు. కృష్ణంరాజు పెద్ద కూతురు లండన్ లో ఎంబీఏ చదివింది. రెండేళ్ల క్రితం యూఎస్ఏలోని లాస్ ఏంజిల్స్ లో ప్రొడక్షన్ కోర్సును పూర్తి చేసింది. ప్రస్తుతం గోపీక్రిష్ణ మూవీస్ ప్రొడక్షన్ కంపెనీ బాధ్యతలను చూస్తోందని సమాచారం..

రెండో కూతురు ప్రకీర్తి హైదరాబాద్ లోని జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ కోర్స్ చేస్తోంది.. మూడో అమ్మాయి సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.. ముగ్గురు కూతుళ్లకు ఇప్పటి వరకు పెళ్లి కాలేదు. కృష్ణంరాజు మరణంతో వారి బాధ్యత ప్రభాస్ మోయాల్సిందే అంటూ ఫిలింనగర్ టాక్.. ప్రభాస్ పెళ్లి చేసి ముగ్గురి పెళ్లిళ్లు చేయాలని కృష్ణంరాజు అనుకున్నారట.. అయితే ఆయన ఈ లోకం వీడటంతో తన పెళ్లి సహా ముగ్గురు చెల్లెళ్ల పెళ్లి బాధ్యతలు ప్రభాస్ చేసుకోవాల్సి వస్తోంది..

Tags: Daughter, hero Prabhas, Krishanm Raju Passed Away, latest news, Marriage