ఇంకా మెళ్లో తాళే క‌ట్ట‌లేదు… అప్పుడే వ‌రుణ్‌ను పిచ్చోడ్ని చేసిన లావ‌ణ్య‌…!

మిస్ ఇండియా అందాల పోటీలో ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరుకుంది ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి మూవీతో టాలీవుడ్‌కి అడుగుపెట్టింది. ఆమె నటించిన మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లావణ్య తర్వాత వరస అవకాశాలను దక్కించుకుంటూ ప‌దేళ్ల పాటు సినిమాల్లో నటిస్తూ వస్తోంది.

చాలావరకు యంగ్ హీరోలతోనే జట్టు కట్టిన లావణ్య సోగ్గాడే చిన్నినాయన మూవీలో నాగార్జునతో కలిసిన నటించింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. లావణ్య నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్‌గా నిలిచాయి. చివరగా హ్యాపీ బర్త్ డే మూవీలో నటించిన లావణ్య.. ఓటిటి వేదికపై అడుగుపెట్టి పులి మేక వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్ అందుకుంది.

ఇదిలా ఉంటే గత నెల మెగా హీరో వరుణ్ తేజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది లావణ్య. మిస్టర్ మూవీలో జోడీగా న‌టించిన ఈ జంట ప్రేమలోప‌డ్డారు. ఆ త‌ర్వాత వీరు మ‌రోసారి అంత‌రిక్షం సినిమాలోనూ క‌లిసి న‌టించారు. ఈ జంట తాజాగా వారి బంధం గురించి చెప్ప‌డంతో పాటు స‌డెన్‌గా ఎంగెజ్మెంట్ చేసుకొని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు.

ప్రస్తుతం లావణ్య తాను కమిటైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు పూర్తి చేయడంతో పాటు టైం దొరికినప్పుడల్లా వరుణ్‌తో వెకేషన్లను ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం ఫారెన్ లో ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తూ తాము గడిపిన హ్యాపీ మూమెంట్స్ ఫొటోల‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది లావణ్య.

తాజాగా ఫారెన్ వీధుల్లో వ‌య్యారంగా నిలబడి ఒక ఫోటోకు స్టిల్ ఇచ్చింది లావ‌ణ్య‌. ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కింద ఆ ఫోటో తీసింది వీ.టి.కే అని మెన్షన్ చేసింది. దీంతో వరుణ్ తేజ్ కొణిదెల లావణ్య ఫోటో తీసాడని క్లారిటీ వ‌చ్చేసింది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకొని వివాహ జీవితంలోనికి అడుగుపెట్టబోతున్నారు. కొంద‌రు నెటిజ‌న్లు మాత్రం ఇంకా మెడ‌లో తాళి కూడా క‌ట్ట‌కుండానే వ‌రుణ్‌ను పిచ్చోడ్ని చేసి బాగానే చుట్టూ తిప్పుకుంటుంద‌ని కామెంట్లు చేస్తున్నారు.