పాన్-ఇండియా సినిమా కోసం ఊర్వశి రౌతేలా రెమ్యూనరేషన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..?

మోడల్ నుండి నటిగా మారిన ఊర్వశి రౌతేలా ప్రస్తుతం తన రాబోయే పాన్-ఇండియా చిత్రం ‘ది లెజెండ్’ సినిమా ద్వారా మళ్ళి వార్తల్లోకి వచ్చింది. జూలై 28న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్‌లో ప్రస్తుతం ఆమె బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని అద్భుతమైన నిర్మాణ విలువలతో నిర్మించారు మరియు భారీ స్థాయిలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో తాను సైంటిస్ట్‌గా నటించనున్నట్లు ఊర్వశి రౌతేలా తెలిపింది. ఆమె మాట్లాడుతూ “నేను సైంటిస్ట్‌నే అయినప్పటికీ యాక్షన్‌, ఎమోషనల్‌ సీన్స్‌, రొమాన్స్‌, డ్యాన్స్‌ కూడా చేశాను. బహుముఖ పాత్ర చేయాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది” అన్నారు.

‘ది లెజెండ్’ కోసం ఊర్వశి రెమ్యూనరేషన్ ఎంత :

ఈ సినిమాలో కథానాయికగా నటించేందుకు ఊర్వశి భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటోంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం, బిలియనీర్ నిర్మాత మరియు నూతన నటుడు శరవణన్‌తో కలిసి ఆమె నటిచినందుకు, ఊర్వశికి రూ. 20 కోట్లు చెల్లించినట్లు తెలిసింది.

ఇటీవల, నటి తన ప్రమోషన్ల కోసం ఫ్లైట్‌లో వెళుతున్నప్పుడు ఆమె అత్యంత ట్రెండింగ్‌లో ఉన్న పోపోపో పాటను పాడినందున అందరి దృష్టిని ఆకర్షించింది.

శరవణన్ అరుల్ ఎవరు?

‘ది లెజెండ్’ చిత్రంలో శరవణన్ అరుల్ ఈ సినిమాతో అరంగేట్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి ఆయనే నిర్మాత. ‘ది న్యూ లెజెండ్ శరవణ స్టోర్స్’ అనే షాపింగ్ కాంప్లెక్స్ చైన్ యజమానిగా శరవణన్ ఇప్పటికే తమిళనాడులో ప్రసిద్ధి చెందాడు, ఇది దుస్తులు, ఫర్నీచర్, ఆభరణాలు మొదలైన వాటిని విక్రయిస్తుంది. విజయవంతమైన వ్యాపారవేత్త అయిన తర్వాత, అతను చిత్రాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.


ది లెజెండ్ మూవీ :

‘ది లెజెండ్’ అనేది పాన్-ఇండియా చిత్రం అని చెప్పబడింది. ఇది తమిళం, తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళం అనే ఐదు భాషల్లో జూలై 28న థియేటర్లలో విడుదల కానుంది.

Tags: hero sarvana, pan india movie, sa, the legend movie, uravasi rautela