రెమ్యున‌రేష‌న్లో దుమ్మురేపుతోన్న టాప్‌-5 తెలుగు హీరోయిన్లు వీళ్లే… ఒక్కొక్క‌రికి ఎన్ని కోట్లంటే..!

ప్రతి సంవత్సరం చిత్ర పరిశ్రమకు ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు.. అయితే వారిలో కొంతమంది మాత్రం స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతారు. ఇప్పుడు మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే స్టార్ హీరోయిన్లుగా ఉంటూ వరుస‌ సినిమాల్లో నటిస్తూ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాప్ – 5 హీరోయిన్లు ఎవరో ఒకసారి చూద్దాం.

సమంత:
ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సమంత తర్వాత వరుస‌ స్టార్ట్ హీరోలు సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగులోనే కాకుంగా బాలీవుడ్‌లో కూడా సినిమాలు కూడా చేస్తోంది. ప్ర‌స్తుతం హైయెస్ట్ రెమ్యూనిరేషన్ అందుకుంటున్న హీరోయిన్ల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక్కో సినిమాకు రూ.5 నుంచి రూ.6 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది.

అనుష్క శెట్టి:
తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన బ్యూటీ అనుష్క. అలాగే ఈ బ్యూటీ కూడా అత్యధిక రెమ్యూనేషన్ తీసుకుంటున్న టాప్ 5 హీరోయిన్లలో ఈమె కూడా చోటు దక్కించుకుంది. అనుష్క కూడా తాను చేసే ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల మేర‌ రెమ్యూనరేషన్ అందుకుంటుంది.

రష్మిక మందన్న‌:
ఛ‌లో సినిమాతో టాలీవుడ్ లో అడిగిపెట్టి పుష్ప సినిమాతో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక ఈమె కూడా తను నటించే ఒక్కో సినిమాకు నాలుగు కోట్ల నుంచి ఆరు కోట్లరకు రెమ్యున‌రేష‌న్ అందుకుంటుంది.

పూజా హెగ్డే:
ఈ పొడుగు కాళ్ళ సుందరి కూడా గత ఏడాది వరకు బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోయింది. కానీ ఇప్పుడు వరుస ప్లాప్‌ల‌తో ఇబ్బంది పడుతుంది. అయినా కూడా పూజ గ్డే తాను నటించి ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ అందుకుంటుంది.

శ్రీ‌లీల‌:
టాలీవుడ్ లోకి వ‌చ్చి రెండేళ్లు కాక‌ముందే ఈ క్యూటీ హ‌య్య‌స్ట్ పెయిడ్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. శ్రీ‌లీల రూ. 2.5 కోట్ల స్థాయిలో పారితోషకం అందుకుంటోంది. అన్న‌ట్లు శ్రీ‌లీల చేతిలో ఇప్పుడు దాదాపు ప‌ది సినిమాలు ఉన్నాయి. అందుకు భ‌గ‌వంత్ కేస‌రి, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌, గుంటూరు కారం, స్కంధ‌ వంటి భారీ సినిమాలు కూడా ఉన్నాయి.