ఎస్ ఇది నిజంగానే టాలీవుడ్‌లో పెద్ద సెన్షేషనల్ న్యూస్ అనాలి. బన్నీ సినిమాలోకి మరో యంగ్ హీరో నితిన్ వచ్చి చేరాడు. అసలు విషయంలోకి వెళితే స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఐకాన్ అనే ఓ సినిమా అనుకున్నారు. దీనికి దిల్ రాజు నిర్మాత. బన్నీ – రాజు కాంబోలో వచ్చిన దువ్వాడ జగన్నాథమ్ సినిమా తర్వాత వెంటనే ఈ ప్రాజెక్టు అనుకున్నారు.
కథలో బన్నీ మార్పులు అడిగాడు. ఆ తర్వాత వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయ్యాడు. ఆ తర్వాత వేణు శ్రీరామ్ ఐకాన్ కథ మీదే కూర్చుండిపోయాడు. మధ్యలో పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్ సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా వచ్చి కూడా మూడేళ్లు అవుతోంది. బన్నీ ఎప్పటకి అయినా ఓకే చెపుతాడన్న ఆశలతో వెయిట్ చేస్తున్నాడు. అయితే బన్నీ పుష్ప, పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా లెవల్లోనే సినిమాలు చేస్తున్నాడు.
దీంతో వేణు శ్రీరామ్ ఐకాన్ కు ఛాన్స్ లేదు. గతంలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చింది కూడా..! ఇప్పుడు బన్నీకి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఈ ప్రాజెక్టు చేసే పరిస్థితి లేకపోవడంతో వేణు ఇప్పుడు ఇదే స్క్రిఫ్ట్‌తో నితిన్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
వేణు శ్రీరామ్ ఉన్నది ఉన్నట్టుగా ఐకాన్ స్క్రిఫ్ట్ నితిన్‌కు చెప్పడం.. నితిన్ వెంటనే ఓకే చెప్పేయడం జరిగిపోయాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లనుంది. ఏదేమైనా బన్నీ ఎప్పుడో నాలుగేళ్ల క్రితం చేయాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు నితిన్ చేతికి చిక్కింది.