అల్లు అర్జున్ హీరోగా వచ్చిన మొదటి సినిమా గంగోత్రి. ఇక రెండో సినిమా ఆర్యతో సూపర్ హిట్‌ను తన ఖాతలో వేసుకున్నాడు బన్నీ. ఈ సినిమాను తెరకెక్కించిన సుకుమర్‌కు కూడా ఇదే మొదటి సినిమా. ఈ సినిమాతో అల్లు అర్జున్‌కు లవర్ బాయ్‌గా మంచి ఇమెజ్ వచ్చింది. ఆర్య 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆ రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 30 కోట్లు వసూలు చేసింది.
యూత్‌లో బన్నీ ఐకాన్‌స్టార్‌గా మారిపోయాడు. అంతకుముందు యేడాది 2003లో నితిన్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ సినిమాకు సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ కృతజ్ఞతతోనే దిల్ రాజు సుకుమార్‌కు తన బ్యానర్లోనే తొలి సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈ సినిమా కథలో ముందుగా సుకుమార్ వేరే హీరోను అనుకున్నారట.
ఆ హీరో మరెవరో కాదు కామెడీ హీరో అల్లరి నరేష్. సుకుమార్ ముందుగా ఆర్య కథను అల్లరి నరేష్ కోసమే రాసుకున్నారట. ఇదే విషయాన్ని రీసెంట్గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నరేష్ చెప్పుకొచ్చాడు.. సుకుమార్ తెరకెక్కించిన 100% లవ్ సినిమా షూటింగ్ సమయంలో అల్లరి నరేష్ ని కలిసిన సుకుమార్ ఈ విషయాన్ని చెప్పినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
అల్లరి నరేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్లరి నరేష్ ఈ సినిమా చేసి ఉంటే మత్రం అయన కేరీర్ మరో లెవలో ఉండేది అని చెప్పాలి. అయితే ఆర్య కథ కేవలం తన కోసమే రాసుకున్నట్టు సుకుమార్ తనకు చెప్పడంతో నరేష్ మాత్రం ఇంత మంచి హిట్ సినిమా మిస్ అయ్యానే అని కుమిలి కుమిలి మరీ బాధపడ్డాడట.