అసలు పెళ్లే వద్దనుకున్న రాహుల్ – చిన్మయిలను ఒక్క‌టి చేసిన టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్స్ లిస్ట్ లో రాహుల్ రవీంద్రన్, చిన్మయి జంట ఒక‌టి. సింగ‌ర్ గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకున్న చిన్మ‌యి.. మీటూ ఉద్య‌మం ద్వారా మ‌రింత పాపుల‌ర్ అయింది. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే రాహుల్ ర‌వీంద్ర‌న్ తో ప్రేమ‌లో ప‌డింది. వీరు ప్రేమ‌ను ఇరు కుటుంబ స‌భ్యులు అంగీక‌రించ‌డంతో.. ఇద్ద‌రూ మూడు ముళ్ల బంధంతో ఒక‌ట‌య్యారు.

ఈ దంప‌తుల‌కు ఇటీవ‌ల క‌వ‌ల పిల్ల‌లు కూడా జ‌న్మించారు. రాహుల్ విష‌యానికి విస్తే.. అందాల రాక్షసి మూవీతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. తొలి సినిమాతోనే త‌నదైన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. ఆ త‌ర్వాత ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా కూడా మారాడు. అయితే రాహుల్ చాలా సైలెంట్‌. సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద‌గా యాక్టివ్ గా ఉండ‌డు.

కానీ, చిన్న‌యి మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. సమాజంలో ఆడ పిల్లలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను సోషల్ మీడియా వేదికగా ఖండిస్తూ.. మహిళల సమస్యలు, వాటి పరిష్కరాల గురించి పంచుకుంటుంది. చిన్న‌యికి ఫైర్ బ్రాండ్ అన్న పేరు కూడా ఉంది. అలాంటి చిన్న‌యి ఒక కామ్ గోయింగ్ అయిన రాహుల్ తో ఏడ‌డుగులు వేయ‌డం వెన‌క ఓ టాలీవుడ్ హీరో ఉన్నాడు. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు సందీప్ కిషన్.

ఈ విష‌యాన్ని రాహుల్‌-చిన్న‌యి దంప‌తులు స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టారు. రీసెంట్ గా ఈ జంట వెన్నెల కిశోర్ హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ‘అలా మొదలైంది‘ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘డబ్బింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి ఎవరో క్యూట్‌గా ఉన్నాడు కదా అని అనిపించిందట. ఈ విషయం పెళ్లి తర్వాత చెప్పింది’ అని రాహుల్ చెప్ప‌గానే..‘అయ్యే ఈయన ఏదో వాగుతున్నాడు.. అసలు తాను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు` అంటూ చిన్న‌యి చెప్పుకొచ్చింది.

ఇంతలో రాహుల్ `నేను కూడా ఈమెను క‌ల‌వ‌క ముందే అలానే అనుకున్నా` అంటూ చిన్న‌యిని ఉద్దేశిస్తూ మాట్లాడాడు. ఇక `త‌మ‌ను ఒక‌టి చేసింది హీరో సందీప్ కిష‌న్ అని.. నువ్వు రాహుల్‏ను కలవాలి.. తనను మీట్ అవ్వాలి` అని చెప్పేవాడని చిన్మయి చెప్పగా.. వెంట‌నే రాహుల్ `సందీప్ తనకోసం అక్కడ మార్కెటింగ్ చేశాడ‌ని` ఫ‌న్నీగా చెప్పుకొచ్చాడు. మొత్తానికి పెళ్లే వద్దనుకున్న రాహుల్‌-చిన్మయిలను సందీప్ కిష‌న్ ఒక‌టి చేశాడ‌న్న‌మాట‌.