ప్రభాస్, కృతి సనన్, సన్ని సింగ్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘ఆదిపురుష్’ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా 7 వేల థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అయితే ఎన్ని థియేటర్లలో ఒక సినిమా రిలీజ్ కావడం గురించి తెలుసుకొని టాలీవుడ్ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ అయిన సినిమాలు ఇంతకన్నా ఎక్కువ సంఖ్యలో రిలీజ్ అయ్యాయి. అవేవో ఇప్పుడు తెలుసుకుందాం.
• ఆర్ఆర్ఆర్
రాజమౌళి డైరెక్టోరియల్ ఆర్ఆర్ఆర్ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 10,200కు పైగా థియేటర్లలో రిలీజ్ అయి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది.
• బాహుబలి 2
మరో రాజమౌళి మూవీ ‘బాహుబలి 2’ కూడా ప్రపంచవ్యాప్తంగా 9,000 వేల దాక థియేటర్లలో విడుదలై ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా దాదాపు అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది.
• సాహో
ప్రభాస్ బాలీవుడ్ మూవీ ‘సాహో’ కూడా 7978 స్క్రీన్స్‌లో రిలీజ్ అయి వావ్ అనిపించింది. కాకపోతే మూవీ ఫ్లాప్ అయింది.
• రాధే శ్యామ్
ప్రభాస్ మరో మూవీ రాధే శ్యామ్ కూడా వరల్డ్‌వైడ్‌గా 7010 థియేటర్లలో విడుదలైంది.
• ఆదిపురుష్
ఇక 7,000 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల అవుతోంది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
• సైరా నరసింహా రెడ్డి
మెగాస్టార్ చిరంజీవి మూవీ ఏకంగా 4,632 స్క్రీన్స్‌లో విడుదల అయి సంచలనం సృష్టించింది.
• బాహుబలి 1
ప్రభాస్ కెరీర్ బెస్ట్ మూవీ ‘బాహుబలి ఫస్ట్ పార్ట్’ కూడా వరల్డ్‌వైడ్‌గా 4,000 పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ అయింది.
• పుష్ప
అల్లు అర్జున్, సుకుమార్ కాంబో మూవీ ‘పుష్ప’ ప్రపంచవ్యాప్తంగా 3,000కు పైగా స్క్రీన్స్‌లో రిలీజ్ అయింది. అన్ని చోట్లా ఇది హిట్ టాక్ తెచ్చుకుంది.
• లైగర్
రౌడీ బాయ్ విజయ్ హీరోగా నటించిన ‘లైగర్’ కూడా 3 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై ఆశ్చర్యపరిచింది. కాకపోతే బాక్సాఫీస్ దగ్గర ఇది డిజాస్టర్ అయింది.
• అజ్ఞాతవాసి
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబో మూవీ ‘అజ్ఞాతవాసి’ తొలి రోజే 2,800 స్క్రీన్స్‌లో రిలీజ్ అయింది.