ఏంటి.. చిరు చేతికి పెట్టుకున్న వాచ్ అన్ని కోట్ల..? స్పెషాలిటీస్ ఇవే..!

సోషల్ మీడియాలో అనేక వార్తలు రకరకాలుగా వైరల్ అవుతాయి. సినీ లవర్స్ అయితే మరీ ఎక్కువ… వాళ్ల అభిమాన హీరో, హీరోయిన్లకు సంబంధించిన పలు రకాల వార్తలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ల వేసుకున్న బట్టలు, వాచ్, డీటెయిల్స్ తెలుసుకుంటూ ఉంటారు. ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు వేసుకున్న వస్తువుల ప్రత్యేకతలు, వాటి ధరలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

తాజాగా చిరంజీవి ధరించిన వాచ్ ధర సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బేబీ సినిమా జులై 14 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌ లో భాగంగా చీప్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి తన మాటలతో, వ్యక్తిత్వంతో అభిమానులు బాగా ఆకట్టుకున్నాడు. చిరంజీవి పెట్టుకున్న వాచ్ ఎంతో తెలుసా. మరి ముఖ్యంగా చిరంజీవి తన చేతికి పెట్టుకున్న వాచ్ అభిమానులకి తెగ నచ్చేసిందట. ఈ క్రమంలోని ఈ వాచ్ ధర ఎంతని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బేబీ సినిమా సక్సెస్ ఈవెంట్లో చిరంజీవి పెట్టుకున్న వాచ్ ధర దాదాపు రూ.1.89 కోట్లుగా తెలుస్తుంది.

అంతేకాదు ఈ వాచ్ చాలా ప్రత్యేకమైనదట. చాలా స్పెషల్ ఫీచర్స్ ఈ వాచ్ కి ఉన్నాయట. మోస్ట్ కాస్ట్లీ ఆట… ఇది ఎక్కువగా దొరకదట… ఎప్పుడో ఒకసారి మాత్రమే మార్కెట్లో దొరుకుతుందని తెలుస్తుంది. వాచ్ పేరు రోలెక్స్ కాస్మోగ్ర‌ఫ్‌ డేటోనా ఐ అఫ్ ది టైగర్ వాచ్…. చాలా తక్కువ మంది సెలబ్రిటీస్ వద్ద ఈ వాచ్ ఉంటదట… ఈ వాచ్ ను చిరంజీవి ఇష్టంగా కొనుక్కున్నాడట. ఈ వాచ్ ధర విన్న చిరు ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అంతేకాదు చిరంజీవి రేంజ్ అది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస‌ క్రేజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు.