నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సమరసింహారెడ్డి’ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా కంటే ముందు వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘లారీ డ్రైవర్’ ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఆ తర్వాత ఏడేళ్ల తర్వాత దర్శకుడు బి.గోపాల్, బాలకృష్ణ కలయికలో వచ్చిన ‘సమరసింహారెడ్డి’, ఈ సినిమా తెలుగులో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను క్రాస్ చేసింది.
అంతేకాదు తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా మారింది. అంతకు ముందు వెంకటేష్ ‘ప్రేమించుకుందాం ..రా’, ‘ మోహన్ బాబు ‘శ్రీరాములయ్య’ సినిమాలు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కినా.. ‘సమరసింహారెడ్డి’ సినిమా మాత్రం ఈ జానర్‌లో వచ్చే సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ‘సమరసింహారెడ్డి’ హిట్‌తో తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలు క్యూ కట్టాయి. దాదాపు తెలుగు స్టార్ హీరోలు అందరు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో సినిమాలు చేసి మంచి సక్సెస్‌లు అందుకున్నారు.
ఒక రకంగా చెప్పలి అంటే తెలుగులో ‘సమరసింహారెడ్డి’తో ఫ్యాక్షన్ సినిమాల ఒరవడి మొదలైంది. ఈ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. రత్నాకర్ కథా సహాకారం అందించిగా. పరుచూరి బ్రదర్స్ పవర్‌ఫుల్ డైలాగ్స్ రాసిన ఈ సినిమా 1999 జనవరి 13న విడుదలై అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను అన్ని తిరగరాసింది. దాదాపు రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 20 కోట్లకు పైగా షేర్ సాధించింది.
అయితే ఈ సినిమాని తొలుత నందమూరి బాలకృష్ణ తో చేద్దాం అని అనుకోలేదట, విక్టరీ వెంకటేష్ తో ఈ చిత్రాన్ని చేద్దాం అనుకున్నారట డైరెక్టర్ బి గోపాల్. వెంకటేష్ కి కథ బాగా నచ్చింది కానీ, తనకి ఇలాంటి సినిమాలు సూట్ అవ్వవు, నాతో కాకుండా చిరంజీవి లేదా బాలయ్యతో తీసుకోండి అని అన్నాడట. దీంతో బి.గోపాల్ , బాలకృష్ణను కలిసి కథ వినిపించడం, ఆయన ఓకే చేసేయడం ఈ సినిమా పట్టాలెక్కడం అన్ని చకచకా జరిగిపోయాయి.
ఇక ఇదే సమయంలో సమరసింహారెడ్డి సాధించిన విజయాన్ని చూసి వెంకటేష్.. ఈ సినిమాను చేసి ఉంటే బాగుండేదని అనుకున్నాడట. అదే సమయంలో ఎస్ శంకర్ అనే దర్శకుడు.. ‘జయం మనదేరా’ అనే ఓ ఫ్యామిలీ ఫ్యాక్షన్ కథతో వెంకటేష్ వద్దకు వచ్చారట.. వెంకీకి ఆ కథ బాగా నచ్చడంతో.. అదే సమయంలోనే ‘సమరసింహారెడ్డి’ వదులుకుని బాధలో ఉన్న వెంకటేష్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ చేశాడు.. ‘సమరసింహారెడ్డి’ విడుదలైన సంవత్సరానికి వెంకటేష్ ‘జయం మనదేరా’ చిత్రం వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ రకంగా వెంకటేష్ ‘సమరసింహారెడ్డి’ కోరికను ఈ సినిమాతో తీర్చుకున్నాడు.