టీడీపీ గెలుపు ఖాయం… వార్నింగ్ ఇచ్చేసిన ఐ ప్యాక్‌…!

ఏపీలో వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న వైసీపీకి గ‌ట్టి ఎదురు దెబ్బే త‌గులుతోంది. తాజాగా స్టిక్క ర్ల కార్య‌క్ర‌మం..గ‌డ‌ప‌గ‌డ‌ప కార్య‌క్ర‌మాల‌తో వైసీపీ నేత‌లు బిజీబిజీగా ఉన్నారు. ఇంటింటికీ తిరుగుతున్నా రు. ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను వివ‌రిస్తున్నారు. ప‌థ‌కాలను ఏక‌రువు పెడుతున్నారు. అయితే.. చాలా చోట్ల‌.. ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తున్న మాట వాస్త‌వం. దీనిని వైసీపీ అధిష్టానం కూడా తోసిపారేయ‌డం లేదు.

ప్ర‌భుత్వంపై స‌హ‌జంగా ఉండే వ్య‌తిరేక‌త అని కూడా చెప్ప‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణా మాల‌ను నిశితంగానే అర్ధం చేసుకుంటోంది. అభివృద్ధి లేక‌పోవ‌డం.. ర‌హ‌దారులు వేయ‌క‌పోవ‌డం.. ఉపా ధి క‌ల్ప‌న‌, ఉద్యోగాలు.. వంటివి.. ప్ర‌భుత్వానికి ఇప్పుడు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేప థ్యంలో తాజాగా ఐప్యాక్ టీం నుంచి వ‌చ్చిన రిపోర్టు వైసీపీకి మ‌రింత కంట్లో న‌లుస‌గా మారిపోయింద‌ని అంటున్నారు.

ఇప్ప‌టికిప్పుడు అభివృద్ధి, ర‌హ‌దారుల‌కు క‌నీసం 50 వేల కోట్ల రూపాయ‌లు కేటాయించాల‌ని ఐప్యాక్ బృందం తేల్చి చెప్పిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎన్నిక‌ల‌కు క‌నీసం ఐదారు నెల‌ల ముందే.. అభివృద్ధిపై దృష్టిపెట్టాల‌ని.. ఎట్టిప రిస్థితిలోనూ..ఈ ప్ర‌భుత్వం అభివృద్ధి చేయ‌డం లేదు.. అనే టాక్ నుంచి బ‌య‌ట ప‌డేయాల‌ని ఐప్యాక్ తేల్చి చెప్పిన‌ట్టు తెలిసింది. అయితే.. అభివృద్ది కాదు.. సంక్షేమ ప్ర‌భుత్వం మ‌న‌ది అని స‌ల‌హాదారుల స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేశార‌ట‌.

కానీ, జ‌నాలు.. సంక్షేమ ప్ర‌భుత్వానికి ఓటేసినా.. ఇప్పుడు ప్ర‌జ‌ల మూడ్ మారిపోయింద‌ని.. వారు అభివృ ద్దిని కోరుకుంటున్నార‌ని.. ఈ విష‌యంలో ఏమాత్రం తేడా వ‌చ్చినా.. చివ‌ర‌కు టీడీపీకి ప‌గ్గాలు ఇచ్చిన‌ట్టు అవుతుంద‌ని కూడా ఐప్యాక్ హెచ్చ‌రించిన‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల్లో టీడీపీ సానుభూతి ప‌వ‌నాలు పెరిగాయ‌ని, గ‌తానికి భిన్నంగా చంద్ర‌బాబు పుంజుకున్నార‌ని..ఇది వైసీపీకి మైన‌స్ అవుతోంద‌ని కూడా ఐప్యాక్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం చేస్తారో చూడాలి.