ఐటీ సోదాలు.. చంద్ర‌బాబు గుండెల్లో గుబులు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ‌ద్ద ప‌నిచేసిన మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీ‌నివాస్ అవినీతి బాగోతాన్ని ఆదాయ పన్ను శాఖ బట్టబయలు చేసింది. ఐదు రోజులుగా శ్రీనివాస్ ఇంట్లో సోదాలు నిర్వ‌హించి ప‌లు కీల‌క అంశాల‌ను ఐటీ శాఖ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కేంద్రంగా మూడు ప్రధాన కాంట్రాక్టు సంస్థలు, బోగస్‌ సబ్‌ కాంట్రాక్టర్లను రాకెట్‌గా ఏర్పాటు చేసుకుని, అధికంగా బిల్లులు చెల్లించినట్లు చూపడం (ఓవర్‌ ఇన్‌వాయిసింగ్‌), బోగస్‌ బిల్లుల‌ ద్వారా సుమారు రూ.2వేల కోట్ల‌ కుంభకోణానికి పాల్పడ్డారని ఆ శాఖ ప్ర‌క‌టించిన సంగ‌తి విధితమే. అందుకు సంబంధించి తిరుగులేని ఆధారాలను సేకరించిన‌ట్లు తెలిపింది.

ఇదిలా ఉండ‌గా ఐటీ శాఖ ప్ర‌క‌ట‌న‌తో చంద్ర‌బాబు గుండెల్లో రైళ్లు ప‌రిగెడ‌తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చంద్రబాబు అకస్మాత్తుగా హైదరాబాద్‌కు పయనమయ్యార‌ని తెలుస్తున్న‌ది. అదీగాక ఐటీ దాడుల్లో తన మాజీ పీఎస్‌ నుంచి అధికారులు పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకోవడంతో.. నిన్న రాత్రి నుంచి న్యాయవాదులు, తన ఆడిటర్లతో బాబు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చంద్రబాబు వెంట తనయుడు నారా లోకేశ్‌ కూడా హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్టు తెలుస్తున్న‌ది. శ్రీనివాస్ ఎక్క‌డా త‌న చిట్టా విప్పేసారేమోనన్న ఆందోళ‌న‌తో చంద్రబాబు షెడ్యూల్ క‌న్నా రెండు రోజులు ముందుగానే హైద‌రాబాద్ వెళ్లిన‌ట్లు తెలుస్తున్న‌ది. కాగా ప్రతీ చిన్న విషయానికి రాద్దాంతం చేసే చంద్రబాబు త‌న మాజీ వ్య‌క్తిగ‌త పీఎస్ ఇంట్లో జ‌రిగిన సోదాల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు నోరు మెదపకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Tags: ex cm chandrababu, ex ps srinivs, it rides, tdp cheaf