సింగర్ మంగ్లీ ఈ పేరు తెలియని తెలుగు ప్రజలు ఉండరు. యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన మంగ్లీ ఆ తర్వాత ప్రవేట్ సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ఊహించిన విధంగా సినిమాల్లో కూడా వరుస అవకాశాలు రావడంతో మంగ్లీ ఫుల్ స్వింగ్లో ఉన్నారు. మాస్ పాటలు విషయంలో మంగ్లీ కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.
మంగ్లీ మాత్రమే కాకుండా మంగ్లీ చెల్లి ఇంద్రవతి కూడా పాటలు పడుతూ అతి తక్కువ టైంలో సూపర్ పాపులర్ అయ్యారు. ఇది ఇలా ఉంటే అటు సినిమా పాటలు.. ఇటు ఫోక్ సాంగ్స్ తో బిజీగా ఉండే ఈ అక్కా చెల్లెళ్లు నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తమ ఫోటోలను షేర్ చేస్తూ నెట్ లో సందడి చేస్తూ ఉంటారు. అయితే హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా ఈ అక్కాచెల్లెళ్లు తమ అందాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంటారు.
తాజాగా వారిద్దరు షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంగ్లీ అటు ఇంద్రావతి ఇద్దరూ కూడా అదిరిపోయే లుక్స్ తో కొంటెగా కవ్విస్తూ ఉన్నారు. ఈ ఫోటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి.